Share News

నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:37 AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పం చాయతీ నిధుల దుర్వినియోగం చేసిన వారి విషయంలో ఉపేక్షించే పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్సష్టం చేశారు

నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

రాజమహేంద్రవరం రూరల్‌/సీతానగరం/ బిక్కవోలు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పం చాయతీ నిధుల దుర్వినియోగం చేసిన వారి విషయంలో ఉపేక్షించే పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్సష్టం చేశారు.పంచాయతీల పరిధిలో శాని టేషన్‌ నిర్వహణ,విధుల్లో అలసత్వం, పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ, తదితర అంశాల ఆధారంగా సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి పంచాయతీ కార్యదర్శి డి .విజయరాజు విధుల్లో అలసత్వంగా ఉండడంపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం విజయరాజును సస్పెండ్‌ చేశారు. సీతానగరం మండలం రఘుదేవపురం (పూర్వపు కార్యదర్శి) కేఎస్‌.రాజశేఖర్‌ను నిధుల దుర్వినియోగంపై సస్పెండ్‌ చేశారు. పన్నుల మొత్తంలో దుర్వినియోగం చేయడంపై పొరుగు సేవల సిబ్బంది టి.లాల్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించి, పంచాయతీ బిల్‌ కలెక్టర్‌ వై అర్జునుడును సస్పెండ్‌ చేశారు. కడియం మండలం దుళ్ళ(ప్రస్తుతం చినకొండేపూడి) పంచాయతీ కార్యదర్శి బి.సరోజారాణి విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్‌ చేశారు. తాళ్ళపూడి మండలం పోచవరం గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఈఎస్‌ రామ లక్ష్మి తప్పుడు జనన ధ్రువీకరణ జారీ చేయ డంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి సస్పెండ్‌ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తొస్సిపూడి పంచాయితీ సెక్రటరీ డి.విజయరాజు స్థానంలో ఇన్‌ చార్జిగా ఊలపల్లి గ్రేడ్‌ 5 పంచాయితీ కార్యదర్శి ఎం.వీరబాబును నియమించినట్టు బిక్కవోలు ఎంపీడీవో వి.శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 01:37 AM