Share News

2 వేల మంది విద్యార్థులు ఏమయ్యారు?

ABN , Publish Date - May 26 , 2024 | 12:51 AM

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తొలి రోజున ఏకంగా సగానికిపైగా విద్యార్థులు డుమ్మా కొట్టారు.. ఇలా జరగడానికి కారణాలేమిటి? పరీక్ష ఫీజు చెల్లించి మరీ ఎందుకు హాజరు కాలేదు?.. తదితర ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది.

2 వేల మంది విద్యార్థులు ఏమయ్యారు?

మార్చిలో ఫెయిలైన వాళ్లు 3926

ఫీజు కట్టిన వారు 2,888 మంది మాత్రమే..

రాజమహేంద్రవరం, మే 25(ఆంధ్రజ్యోతి) : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తొలి రోజున ఏకంగా సగానికిపైగా విద్యార్థులు డుమ్మా కొట్టారు.. ఇలా జరగడానికి కారణాలేమిటి? పరీక్ష ఫీజు చెల్లించి మరీ ఎందుకు హాజరు కాలేదు?.. తదితర ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పది వార్షిక పరీక్షలు, ఉత్తీర్ణత సాధించిన వారు, సప్లిమెంటరీకి ఫీజులు చెల్లించిన విద్యార్థులు వంటి అంశాలను పరిగణన లోకి తీసుకొని విశ్లేషణ చేస్తే జిల్లాలో ఏకంగా 2 వేల మంది పది పాస్‌కాని విద్యార్థులు చదువు ఆపేశారా? అనే ఆందోళన కలుగుతోంది. జిల్లాలో ఈ నెల 24 నుంచి పది పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 3వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. 44 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎప్పుడూ లేని విధంగా అధిక శాతం విద్యార్థులు తొలి రోజు పరీక్షకు దూరంగా ఉన్నారు. పోనీ కష్టమైన సబ్జెక్టు అనుకుంటే.. తొలి రోజున తెలుగు/సంస్కృతం నిర్వహించారు. ఈ పరీక్షకు 2,888 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోగా కేవలం 1239 మాత్రమే హాజరయ్యారు. ఏకంగా 1649 మంది పరీక్ష రాయలేదు. ఈ మార్చిలో పది వార్షిక పరీక్షలు జరిగాయి. మొత్తం 23367 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 19441 మంది (83ు) పాసయ్యారు. 3,926 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. వీరిలో కేవలం సగం మంది వరకే పరీక్ష ఫీజు చెల్లించారని తెలుస్తోంది. అంటే దాదాపు 2 వేల మంది విద్యార్థులకు పది దాటే ఉద్దేశం లేదా? వారంతా ఏమయ్యారు?.ప్రతి విద్యా ర్థి ఫీజు చెల్లించి, పరీక్షకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్‌ మాధ వీలత పలుమార్లు సమీక్షా సమావేశంలో ఆదేశించారు. జిల్లా ఉన్న తాధికారులు కూ డా పాఠశాలలకు ఎప్పటికప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చారు.కానీ సగం మంది విద్యా ర్థులు మాత్రమే ఫీజు చెల్లించారు. సప్లిమెం టరీకి హాజరైన విద్యా ర్థుల్లో కూడా భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పరీక్ష ఫీజు చెల్లించి కూడా పరీక్ష రాయకుండా గైర్హా జరై ఏ కారణాల వల్ల ఏడా ది వృథా చేసుకున్నారనే ప్రశ్న వేధిస్తోంది. జిల్లాలో పది తర్వాత 2 వేల మంది విద్యార్థులు చదువు ఆపేసి నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

రెండో రోజు అదే తీరు..

రెండో రోజు హిందీ పరీక్షకు తీరు ఇలాగే ఉంది. మొత్తం సప్లిమెంటరీ పరీక్షకు 1088 దరఖాస్తు చేసుకున్నారు.. అయితే కేవలం 86 మంది హాజరు కావడం గమనార్హం. గతంలో సప్లిమెంటరీ పరీక్ష అంటే 10 నుంచి 20 మంది మాత్రమే గైర్హాజరయ్యేవారు. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా వేలల్లో గైర్హాజరవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విద్యార్థులు ఎందుకు హాజరుకావడంలేదనేది ప్రశ్నార్థకంగా మారింది.. దీనిపై ఇకనైనా ఉన్నతాధికారులు, తల్లిదండ్రులు దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - May 26 , 2024 | 12:51 AM