సుందరీకరణతో పాటు అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:06 AM
రాజమహేంద్రవరాన్ని పూర్తిస్థాయి లో సుందరీకణ చేయడంతోపాటు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని ఎమ్మె ల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.

గోదావరి బండ్ పై సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం సిటీ, జూలై 7: రాజమహేంద్రవరాన్ని పూర్తిస్థాయి లో సుందరీకణ చేయడంతోపాటు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని ఎమ్మె ల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గోదావరి బండ్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మా ణం, ఇతర అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో ఆయన సమావేశం నిర్వహించారు. పలు పనులపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహనలేమితో నాణ్యతలేని పనులను గత ప్రభుత్వ పాలకులు చేశారని, ఇటువంటి విధానానికి స్వస్తి పలికి ప్రజలతో మమేకమై వారి సూచనల మేరకు అభి వృద్ధి పనులు కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు. పద్మావతి ఘాట్‌లో పిండ ప్రధానం చేసేందుకు వీలుగా గోదావరి నదిలోకి 20 అడుగులు ర్యాంప్ నిర్మాణ బాధ్యతలను మునిసిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ చేపతుందన్నారు. అలాగే నగర ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే నిర్మాణం రాబోయే పుష్కరాలలోపు చేపట్టే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్‌తో చర్చించామన్నారు. అలాగే నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేష్ ఎస్‌ఈపాండురంగారావు, ఈఈ ఎన్‌హెచ్ మదర్‌షా అలీ, డీఈ బీవీ రమణమూర్తి, జనసేన ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, కాశి నవీన్‌కుమార్, వై.శ్రీను, దీపు, రెడ్డి మణి, నల్లం శ్రీను పాల్గొన్నారు.
ఐఏఎస్ ట్రస్ట్ ప్రజలకు ఉపయోగపడాలి
ఐఏఎస్ సేవా సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘంలో ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్(లండన్) ఆధ్వ ర్యంలో స్థానిక ప్రతినిధి గౌతమ్ బృందం సభ్యులు ఆదివారం వృద్ధులకు చీరలు, లుంగీలు, చిన్నారులకు బుక్స్, బ్యాగ్‌లు పెన్లు పంపిణీ చేశారు. దీనికి ఎమ్మెల్యే వాసు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో సేవల ందించేందుకు గౌతమ్ బృందం రావడం ఆనందంగా వుందని, పుష్కరాలకు కూడా సేవలందించాలన్నారు. ట్రస్ట్ రీజనల్ మినిస్టర్ రాంబాబు మాట్లాడుతూ ఈ సంస్థ లండన్‌లో 1913లో ఆవిర్భవించి, భారత్‌కు 2019లో, ఏపీకి గత డిసెంబర్లో వచ్చిందన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే సంస్థ ముఖ్యఉద్ధేశమన్నారు. పుష్కరాలకు మూడు చారిటీ సంస్థలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు.
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
రాజమహేంద్రవరం కల్చరల్, జూలై7: స్థానిక ఆనం కళాకేంద్రంలో భట్రా జ సంఘ జిల్లా అధ్యక్షుడు లోలభట్టు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అత్యు న్నత మార్కులు సాధించిన 16మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, జ్ఞాపిక లను పర్యాటకశాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బహూకరించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భట్రాజు కులంలో రామరాజ భూషణుడు, కాసుల పురుషోత్తమ కవి వంటి ప్రసిద్ధ కవులు న్నారని, ఆది కవి నన్నయకు సహాధ్యాయుడైన నారాయణ భట్టు, సినీగేయ రచయిత రసరాజు వరకూ ఎందరో మహనీయులు ఈ కులానికి చెందిన వారేనని అన్నారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ భట్రాజు కులంలో ఎస్‌ఆర్ భల్లం, రాళ్లబండి కవితాప్రసాద్ వంటి ఎందరో ప్రముఖులన్నారని అన్నారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు బీహెచ్ రమాదేవి, సీహెచ్ వెంకట రామరాజు, చిట్టిమన్ని వెంకటరాజు, శివరామకృష్ణ, సీతారామరాజు, ఎల్.శ్రీని వాసరాజు పాల్గొన్నారు.