Share News

వేసవిలో ఉపాధి కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:17 AM

వేసవి దృష్ట్యా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటు లో ఉంచా లని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు.

వేసవిలో ఉపాధి కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు

తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలి: కలెక్టర్‌ నివాస్‌

కలెక్టరేట్‌(కాకినాడ), ఏప్రిల్‌ 4: వేసవి దృష్ట్యా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటు లో ఉంచా లని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలు మండుతున్నందున పనిదగ్గర టార్ఫాలిన్‌తోగానీ, కొబ్బరి ఆకులతో గాని నీడ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే కూలీల పని ప్రదేశంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సదుపాయం కల్పించాలన్నారు. కూలీలు తెల్లటి వస్త్రాలతో తలపాగా చుట్టు కోవాలన్నారు. 90 రోజుల పని దినాలను దశలవారీగా పూర్తి చేయాలన్నారు. నిర్ధేశించిన ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వించాలన్నారు. 2024-25 బడ్జెట్‌ ప్రకారం 80లక్షల పనిదినాల మొత్తంలో 80శాతం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి వంద రోజులు పనిదినాలు కల్పించాలని, రూ..300 వేతనం రోజుకి అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ అడపా వెంకట లక్ష్మీ, ఏపీడీ వసంత మాధవి పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:17 AM