Share News

1 నుంచి పిఠాపురంలో వేసవి ఉచిత శిక్షణా తరగతులు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:29 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 17: పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మే 1వ నుంచి 15వ తేది వరకూ వేసవి ఉచిత శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం మిత్రమండలి ప్రతినిధులు ఆవిష్కరించారు. స్పోకెన్‌ ఇంగ్లీషు, గ్రామర్‌, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక కళలు

1 నుంచి పిఠాపురంలో వేసవి ఉచిత శిక్షణా తరగతులు

పిఠాపురం, ఏప్రిల్‌ 17: పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మే 1వ నుంచి 15వ తేది వరకూ వేసవి ఉచిత శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం మిత్రమండలి ప్రతినిధులు ఆవిష్కరించారు. స్పోకెన్‌ ఇంగ్లీషు, గ్రామర్‌, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక కళలు తదితర అంశాల్లో రోజూ ఉద యం 8నుంచి 11గంటల వరకూ ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. 24 ఏళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పా ల్గొనేవారు పూర్తి వివరాలకు 79899282 89, 7749828167ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు ఈ నెల 28,29, 30వ తేదీల్లో తమ పేర్లును సూర్యరాయ గ్రంథాలయంలో నమోదు చేయించుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో సహృదయ మిత్రమండలి ఉపాధ్యక్షుడు పోతుల శ్రీ నివాస్‌, ప్రదాన కార్యదర్శి సీహెచ్‌.సతీష్‌, సాంఘిక సంక్షేమశాఖ విశ్రాంత డీడీ అప్పారావు, పోలుపర్తి వేణు, గ్రంథాలయ కా ర్యదర్శి కొండేపూడి శంకరరావు, వరదా వీరభద్రరావు, కామరాజు, ప్రభు, డాక్టర్‌ ఎన్‌.సూర్యనారాయణ, నగేష్‌ ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:29 AM