యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ జూదం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:54 AM
ఓ సారి తప్పు చేశాడు. పెద్దవాళ్లు అప్పుల ఊబినుంచి బయటకు తీసుకొచ్చారు.అయినా మారని బుద్ధి చివరికి ప్రాణాలు తీసి భార్య, పిల్లలను రోడ్డున పడేసింది.

రాజమహేంద్రవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఓ సారి తప్పు చేశాడు. పెద్దవాళ్లు అప్పుల ఊబినుంచి బయటకు తీసుకొచ్చారు.అయినా మారని బుద్ధి చివరికి ప్రాణాలు తీసి భార్య, పిల్లలను రోడ్డున పడేసింది. శ్రీకాకుళం జిల్లా నిద్దాం గ్రామానికి చెందిన ఎర్నేన లక్ష్యంనాయుడు(31) ఎర్రవరంలోని ఓ ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తూ రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నాడు. మూడేళ్ల కిందట వివాహం కాగా భార్య, కుమార్తె నిద్దాంలో ఉంటు న్నారు. ఈ క్రమంలో లక్ష్యంనాయుడు ఆన్‌లైన్‌లో రమ్మీకి బానిసయ్యాడు. సుమారు రూ.6 లక్షలు అప్పులు చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి కాస్త మందలించి రూ.3లక్షలు తీర్చేశాడు. మరో రూ.3లక్షలు మిగతా అప్పులు తీర్చాలని లక్ష్యంనాయుడి ఖాతా లో జమచేశారు. అయితే వాటితో మళ్లీ రమ్మీ మొదలు పెట్టాడు. తిరిగి రూ.6లక్షల అప్పు చేశాడు. ఈ క్రమంలో 6న ఉదయం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వరసకు చిన్నాన్న అయిన పోతు రాజు ఉమా మహేశ్వరరావు ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరి ఫోన్ టవర్ లొకేషన్ గామన్ బ్రిడ్జి పరిసరాల్లో చూపించింది. దీంతో గోదావరిలో గాలింపు చేపట్టారు. గురువారం ఉద యం సమయంలో లక్ష్యంనాయుడి మృతదేహాన్ని గుర్తిం చారు.