Share News

ఎడ్యుకేర్‌ విద్యార్థుల ఔదార్యం

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:04 AM

మామిడికుదురు, ఫిబ్రవరి 12: నగరం ఎడ్యుకేర్‌ ఇంగ్లీషు మీడియం స్కూలులో 8వ తరగతి చదువుతున్న బళ్ల రామ్‌యోచన్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ బాలుడిని వైద్యులకు చూపించగా రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ప్రతీ రెండు రోజుల

ఎడ్యుకేర్‌ విద్యార్థుల ఔదార్యం
కిడ్నీ వ్యాధిగ్రస్త బాలుని కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందిస్తున్న ఎంఈవోలు, ఎడ్యుకేర్‌ స్కూలు కరస్పాండెంట్‌ తదితరులు

వైద్య అవసరాల కోసం బాలునికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

మామిడికుదురు, ఫిబ్రవరి 12: నగరం ఎడ్యుకేర్‌ ఇంగ్లీషు మీడియం స్కూలులో 8వ తరగతి చదువుతున్న బళ్ల రామ్‌యోచన్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ బాలుడిని వైద్యులకు చూపించగా రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ప్రతీ రెండు రోజులకు డయాలసిస్‌ చేస్తున్నప్పటికీ వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని, దానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దీనిపై స్పందించిన ఎడ్యుకేర్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ మురార్జీ సూచన మేరకు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు విరాళాలుగా రూ.10 లక్షలు సేకరించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఎంఈవోలు సీహెచ్‌ లక్ష్మీనారాయణ, వెంకన్నబాబు బాలుని కుటుంబ సభ్యులకు సోమవారం అందించారు. సహ విద్యార్థిని ఆదుకోవడానికి ముందుకొచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంఈవోలు అభినందించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత కె.మురార్జీ, డైరెక్టర్‌ కె.సత్యవాణి, ప్రిన్సిపాల్‌ భాస్కర శ్రీనులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 01:04 AM