Share News

స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్‌, జేసీ

ABN , Publish Date - May 26 , 2024 | 01:24 AM

కాకినాడ జేఎన్‌టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థను శనివారం కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీ లించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్‌ రూ మ్‌లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్‌, జేసీ

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 25: కాకినాడ జేఎన్‌టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థను శనివారం కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీ లించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్‌ రూ మ్‌లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్‌ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్‌ టీయూలో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల్లో సురక్షితంగా భద్రపరచడం జరిగిందన్నా రు. స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లు వివరాలు లాగ్‌ రిజిస్ట ర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు రెండు, మూడు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లను తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే జేఎన్‌టీయూ సెంట్రల్‌ లైబ్రరీలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను శనివారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి సందర్శించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్ప టికప్పుడు స్ట్రాంగ్‌రూమ్‌కు వెళ్లి అక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. జూన్‌ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 01:24 AM