Share News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:48 AM

రాష్ట్ర ప్రయోజనాలు, భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఏర్పాటైందని ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 7: రాష్ట్ర ప్రయోజనాలు, భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఏర్పాటైందని ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరంలోని శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాలల ఆవరణలో అత్తిలి బాబూరావు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశంలో బుచ్చిబాబు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ముసుగులో ప్రజా ధనాన్ని దోచుకున్నారన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎటువంటి అమరికలు లేకుండా అంతా కలిసి ప్రయానిద్దాం, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, వైసీపీ నిలిపివేసిన సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని రూ.1800 కోట్లతో అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధిని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమలాపురం పార్లమెంటు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్‌ మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. కోనసీమ ప్రజల చిరకాల వాంచ కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను పూర్తిచేసి రైలుకు కూతను ప్రజలకు వినిపిస్తానన్నారు. కోకోనట్‌ బోర్డు ఏర్పాటు, అధ్వానంగా ఉన్న రోడ్ల ఆధునికీకరణకు కృషి చేస్తానన్నారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ తమకు జనసేన పార్టీ పవన్‌కల్యాణ్‌ ఆదేశాలే శిరోధార్యమన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని, నియోజకవర్గ ఇన్‌చార్జి పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లినా జనసేన పార్టీ కార్యకర్తలెక్కడా మనోధైర్యాన్ని కోల్పోలేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, తాడి నరసింహారావు, నడింపల్లి సుబ్బరాజు, దూడల స్వామి, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాలప్రసాద్‌, గుద్దటి జమి, ముత్యాల జయలక్ష్మి, రంబాబ రమేష్‌, గోదశి పుండరీష్‌, పుణ్యమంతుల సూరిబాబు, లంకలపల్లి సత్యనారాయణ, మెండా శివకోటి, దాట్ల పృథ్విరాజ్‌, గొలకోటి వెంకటరెడ్డి, అంగాడి నరసింహమూర్తి, చెల్లి అశోక్‌, అర్థాని శ్రీనివాసరావు, గొలకోటి దొరబాబు, సాకా సీతాదేవి, అత్తిలి బాబూరావు, చిల్లా అనూష, గూడాల నాని పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:48 AM