Share News

రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:14 AM

రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని రాష్ట్ర టీడీపీ క్యాంపెయినర్‌ వంగవీటి రాధా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరపల్లి మండలంలో రోడ్డుషోలో టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, కూటమి నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు, జనసేన ఇన్‌ఛార్జ్‌ సువర్ణరాజు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
దేవరపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ

  • టీడీపీ రాష్ట్ర క్యాంపెయినర్‌ వంగవీటి రాధా

దేవరపల్లి, ఏప్రిల్‌ 29: రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని రాష్ట్ర టీడీపీ క్యాంపెయినర్‌ వంగవీటి రాధా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరపల్లి మండలంలో రోడ్డుషోలో టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, కూటమి నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు, జనసేన ఇన్‌ఛార్జ్‌ సువర్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుషో బంధపురం, దేవరపల్లి, రామన్నపాలెం, కొత్త గూడెం, ధూమంతనగూడెం, కృష్ణంరాజుపాలెం, యర్నగూడెం, త్యాజంపూడి గ్రామాల్లో జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వంగవీటి రాఽధాకృష్ణ మాట్లాడుతూ విజన్‌ ఉన్న వ్యక్తి చంద్రబాబు అని, ప్రజలకు మంచి చేసే వ్యక్తి పవన్‌కల్యాణ్‌ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమంతో పాటు రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుకు సైకిల్‌ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడు తూ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్‌డీఏ కూటమిని గెలిపించాలన్నారు. కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లాలన్నారు. మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజారాజ్యం రావాలంటే సైకో సీఎం జగన్‌ను ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. డి.సువర్ణరాజు మాట్లాడుతూ కూటమి విజయం కోసం, ఎన్‌డీకే కూటమి కలవడానికి తన సీట్లు తగ్గించుకుని బీజేపీ, టీడీపీ, జనసేన కలిసేలా పవన్‌కల్యాణ్‌ చేసిన కృషి మరువలేమన్నారు. కార్యక్రమంలో సుంకర దుర్గారావు, గన్నమని హరికృష్ణ, కాట్రు భీమరాజు, యాగంటి వెంకటేశ్వరరావు, గద్దే సుబ్రహ్మణ్యం, యాగంటి శ్రీనివాస్‌, ఉప్పులూరి రాంబాబు, అనిశెట్టి గంగరాజు, కాట్నం గణేష్‌, సత్తిబాబు, శివనాగరాజు, మైలు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 01:14 AM