Share News

రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యం

ABN , Publish Date - May 03 , 2024 | 01:09 AM

అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా వారు అభివృద్ధి చెందే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యం అని ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యం

ఎన్నికల ప్రచారంలో

ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌, మే 2: అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా వారు అభివృద్ధి చెందే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యం అని ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో శాటిలైట్‌సిటీలో గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సారథ్యంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. ఒక్క చాన్స్‌ అంటూ అవకాశం ఇస్తే గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అనివిధాలా నాశనం చేశారన్నారు. పేద వారిని పథకాల పేరుతో మోసంచేసి వారిని నట్టేట ముంచారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి అధికారంలోకి రాబోతుందని, పేదవారిని అన్నివిధాలా ఆదుకోవడమే కూటమి లక్ష్యం అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ సైకిల్‌ గుర్తుపైనా, ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు.

ఫ కాతేరు గ్రామంలో కూటమి అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కుమార్తె కంఠమనేని శిరీష టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రజాగళం పేరిట ఉమ్మడి మెనిఫెస్టో విడుదల సందర్బంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాబిషేకం చేసారు. బడుగు బలహీన వర్గాలను నమ్మించి మోసం చేసిన ప్రబుత్వం వైసీపీ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబందించి 27 పథకాలను జగన్‌ రద్దు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మజ్జి పద్మ, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, బిక్కిన సాంబశివరావు, గంగిన జాహ్నవి, పిల్లా తనూజ, ముత్తాబత్తుల విజయ, మద్ద మణి, జనసేన నాయకులు రాకుర్తి నాయుడు, తాతపూడి రాజేష్‌, షేక్‌ అమీనా, అరుణచౌదరి, బీజేపీ నాయకులు ఏనాపు ఏసు, రామారావు, సురేష్‌, సూర్యకిరణ్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు కొల్లి సుందరం, మేకల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి

ఫ జనసేన. టీడీపీ, బీజేపీ ఉమ్మడి బత్తుల బలరామకృష్ణ

ఫ చైతన్య రథంపై రోడ్‌షో

దివాన్‌చెరువు, మే 2 : ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని ఉమ్మడి పార్టీల నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజానగరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి బత్లుల బలరామకృష్ణ గురువారం మండలంలోని శ్రీకృష్ణపట్నం, కొండగుంటూరు, సంపత్‌నగర్‌, కొత్తతుంగపాడు, పాతతుంగపాడు, రాధేయపాలెం గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు ఆయనకు మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా తనకు గాజు గ్లాసు గుర్తుపైన, ఎంపీగా పోటీచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బత్తుల అభ్యర్థించారు. దీనిలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు, కూటమి ఉమ్మడి మేనిఫోస్టో గురించి ప్రజలకు వివరించారు. ఇందుకు సంబంధిన కరపత్రాలను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగిశెట్టి చంటిబాబు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కందుల బాబూరాయుడు, వంక మల్లిబాబు, మద్దిరెడ్డి చిన వెంకటేశ్వరరావు, బత్తుల త్రిమూర్తులు, బచ్చు ప్రసాద్‌, బోయిడి శ్రీనివాస్‌, పెమ్మనబోయిన వెంకటేష్‌, పేపకాయల విష్ణుమూర్తి, ఏగిశెట్టి రాజు, ఉల్లింకల లోవరాజు, మేడిశెట్టి శివరాం, రావిపాటి చిన్న, కొత్తపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

బత్తుల బలరామకృష్ణ రోడ్‌ షో

కోరుకొండ: జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చైతన్య రథంపై గురువారం రోడ్‌షో నిర్వహించారు. మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. బలరామకృష్ణను 50వేల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. రోడ్‌షో రాజానగరం మండలంలోని కొండగుంటూరు, కొండగుంటూరుపాకల, నామవరం గ్రామాల్లో భారీ జన సమూహం మండుటెండను లెక్కచేయకుండా బలరామకృష్ణ రోడ్‌షోలో పాల్గొన్నారు. శ్రీకృష్ణపట్నం, భూపాలపట్నం, పుణ్యక్షేత్ర గ్రామాల్లో భారీ జన సమూహం బలరామకృష్ణ రోడ్‌షోకు స్వాగతం పలికారు. గుమ్మడికాయ దిష్టి తీశారు. హారతులు పట్టారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో త్రిశూల వ్యూహంలో భాగంగా అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం ముగ్గళ్ళలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై ఓటువేసి కూటమి ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కోరారు. ఈ ఇంటింటి ప్రచారంలో వీర మహిళలు, జనసైనికులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీతానగరం: వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటిమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన కోఆర్డినేటర్‌ బత్తుల వెంకట లక్ష్మి అన్నారు. గురువారం ఆమె సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమెకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో పెందుర్తి అచ్చుతరామారావు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు.

మతం పేరు చెప్పి మోసంచేసే నాయకులను నమ్మకండి

ఎన్డీయే కూటమి జీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, మే 2: మతం పేరు చెప్పి కొందరు నాయకులు మోసాలకు పాల్పడతారని అటువం టి నాయకులను నమ్మవద్దని కులమతాలకు అతీతంగా సేవచేసే నాయకులే అన్ని వర్గాలకు చేరువవుతారని అనపర్తి నియోజకవర్గ ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం అనపర్తిలోని ఎస్‌ఎన్‌ఆర్‌ కళ్యాణ మండపంలో నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీ య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు బైబిల్‌ పట్టుకుని ముందుకొచ్చిన జగన్‌ కుటుంబం క్రైస్తవులను మోసగించిందన్నారు. 2019 ఎన్నికలలో హిందువులను ఏమార్చేందుకు గంగానదిలో స్నానమా చరించి హిందువుగా మతం మార్చుకుంటానని మరలా మోసంచేసిన వ్యక్తి జగన్‌రెడ్డి అని అన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ సోదరులు ఎన్డీయే కూటమికి సహకరించాలని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ భారతదేశ లౌకికవాదాన్ని కాపాడుతూ ముందుకు సాగుతానని అన్నారు. మరో అతిథిగా విచ్చేసిన ఎంపీ అభ్యర్థిని పురందేశ్వరి తన యుడు హితేష్‌ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన ఎన్టీఆర్‌ వారసులుగా మీ ముందుకు వచ్చామని క్రైస్తవ సోదరులు ఎన్డీయే కూట మిని ఆదరించాలని కోరారు. అనంతరం పాస్టర్లు నల్లమిల్లి, హితేష్‌లను ఘనంగా సత్కరించారు. నాలుగు మండలాలకు చెందిన పాస్టర్లు పాల్గొన్నారు.

మహేంద్రవాడలో మనోజ్‌రెడ్డి ఇంటింటా ప్రచారం

అనపర్తి మండలం మహేంద్రవాడలో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి తనయుడు మనోజ్‌రెడ్డి తండ్రి విజయం కోరుతూ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు చేకూరే మేలును వివరిస్తూ ఆయన ప్రచారం నిర్వహిం చారు. ఆయన వెంట టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దొడ్డిగుంటలో టీడీపీలో 11 కుటుంబాలు చేరిక

రంగంపేట, మే 2: మండలంలోని దొడ్డిగుంట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గురువారం వడిశలేరులో టీడీపీ జిల్లా ప్రధాన కార్యరద్శి ఆళ్ళ గోవింద్‌ నివాసంలో జరిగిన సమావేశంలో దొడ్డిగుంట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు దూళ్ళ దసరబాబు, బోడ సుబ్బారావు, ఆలపు అబ్బులు, దారా సూర్యప్రకాష్‌, కల్తూరి రాజేష్‌, 11 కుటుంబాలకు చెందిన సభ్యులు టీడీపీలో చేరారు. అలాగే రంగంపేటలో వైసీపీ నుంచి సీనియర్‌ నాయకులు పోతుల బుల్లి వీరన్నచౌదరి, 25 కుటుంబాల సభ్యులు అనపర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజెపీ కన్వీనర్‌ ములగపాటి శివరామకృష్ణంరాజు, సాయిరాం పాల్గొన్నారు.

రంగంపేటలో మహాలక్ష్మీ ఎన్నికల ప్రచారం

రంగంపేటలో గురువారం అనపర్తి నియోజక వర్గ ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉండవిల్లి గిరిబాబు, బలిరెడ్డి దుర్గాప్రసాద్‌, ప్రసాద్‌,పోతుల వీరన్న, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే నాయీబ్రాహ్మణుల అభివృద్ధి

ఫ టీడీపీ నాయీబ్రాహ్మణ నేతలు

రాజమహేంద్రవరం సిటీ, మే 2: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే నాయీబ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్‌, తెలుగుయువత నగర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కందికొండ అనంత్‌, నగర అధ్యక్షుడు అలజంగి దేవుడులు అన్నారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జగన్‌ పాలనలో నాయీబ్రాహ్మణులకు చేసింది శూన్యమన్నారు. జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో నాయీబ్రాహ్మణులకు చేసిన వాగ్ధానాలు అధికారంలోకి వచ్చాక విస్మరించారని చెప్పారు. ఇటీవల జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా నాయీబ్రాహ్మణులకు ఏ వరాలు ప్రకటించలేదన్నారు. తమ నాయకుడు 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ బిల్లులు ఉచితం ప్రకటించడం ఆనందంగా ఉందన్నా రు. 2014-19లో చంద్రబాబు 145 కోట్లతో ఫెడరేషన్‌ ద్వారా నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి కేటాయించారని చెప్పారు. అదరణ పఽథకం ద్వారా నాయీబ్రాహ్మణులను ఆదుకున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో 450 సెలూన్‌ షాపులు ఉన్నాయని అందరికీ కలిపి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ విజయానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో తెలుగు యువత నగర కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్‌, నాయీబ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు కోటిపల్లి చంద్రశేఖర్‌, జిల్లా సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, కొర్రపల్లి నాగేశ్వరరావు, బలగం కిరణ్‌, సీనియర్‌ నాయకులు జామి వరప్రసాద్‌, పాలవలస లోకేష్‌, పెండ్యాల మహేష్‌ కుమార్‌, సమితి రూరల్‌ అధ్యక్షుడు పాతర్లపల్లి సురేష్‌, ప్రధాన కార్యదర్శి రాము పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 01:09 AM