Share News

రాష్ట్రంలో అరాచక పాలనను తరిమికొట్టాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:51 AM

రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తుమ్మల బాబు, విత్తనాల వెంకటరమణలు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అరాచక పాలనను తరిమికొట్టాలి

సామర్లకోటలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పిలుపు

సామర్లకోట, మార్చి 21: రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తుమ్మల బాబు, విత్తనాల వెంకటరమణలు పిలుపునిచ్చారు. ఎన్నికల కూటమిలో భాగంగా మూడు పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే చినరాజప్ప అధ్యక్షతన ఆత్మీయ సమావేశం గురువారం రాత్రి సామర్లకోట పూర్ణా ఫంక్షన్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడు తూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారాలువేసి ప్రజల ధనాన్ని దోచుకు ంటూ, మరోవైపు జే బ్రాండ్‌ కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ మందు బాబుల ఆరోగ్యా లతో ఆటలాడుతున్నారని విమర్శించారు. అనంతరం బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ అమలుచేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గులే కుండా వైసీపీ నాయకుల ఫోటోలను ముద్రించి ప్రచారం చేసుకో వడం సిగ్గుచేటని విమర్మించారు. జనసేన పెద్దాపురం ఇంచార్జి తుమ్మల బాబు మాట్లాడు తూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని జనసే నానిలు అందరూ బలపర్చడం ద్వారా పెద్దాపురం నియోజకవర్గంలో మూడు పార్టీ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పను గెలిపించేందుకు అందరూ ఏకతాటిపై నిలవాలని తుమ్మల బాబు పిలుపునిచ్చారు. ఈ సభకు పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆత్మీయ విందులో పాల్గొన్నారు.

మూడు పార్టీల కండువాలతో ఎమ్మెల్యే చినరాజప్ప

టీడీపీ, జనసేన, బీజేపీ తెలుగుదేశం, భారతీయ కూటమి అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో గురువారంరాత్రి సామర్లకోటలో నిర్వహించిన మూడు పార్టీల ఆత్మీయ కూటమి సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప మూడు పార్టీల కండువాలను ధరించడం విశేషం. తొలిసారిగా నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ఈ తొలిసదస్సుకు ఊహాలకు మించి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో పాల్గొనడంతో మూడుపార్టీలకు చెందిన నాయకులలో జోష్‌ పెరిగింది.

మాటిచ్చి మడంతిప్పేసిన వైసీపీని నమ్మొద్దు: బుచ్చిబాబు

తాళ్లరేవు: ఒక్కచాన్స్‌తో ప్రజలకు మాటిచ్చి మడంతిప్పేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మవద్దని ఉమ్మడిపార్టీల అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అన్నారు. గురువారం కోరింగ పంచాయతీ పెదబొడ్డువెంకటాయపాలెం, పాతకోరింగ గ్రామాల్లో గ్రామకమిటీ అధ్యక్షుడు వెంటపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. చినబొడ్డులో పెమ్మాడి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రజలను మోసగించిన వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దని టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఉప్పంగల గ్రా మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి సూపర్‌సిక్స్‌ బాండ్లను పంపిణీ చేశారు. వాడ్రేవు వీరబాబు, టేకుమూడి అనంతలక్ష్మి, పొన్నమండ రామలక్ష్మి, జవ్వాది సత్యవేణి, వెంటపల్లి ఉమామహేశ్వరి, టేకుమూడి లక్ష్మణరావు, చంద్రాల ఆదినారాయణ, జవ్వాది తాతాజీ, దాసరి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన గోవలంక సర్పంచ్‌

గోవలంక సర్పంచ్‌ కోరుకొండ సింహాద్రమ్మ తన అనుచరులతో టీడీపీలో గురువారం చేరారు. టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు గోవలంక సర్పంచ్‌ తన అనుచరులకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రంలో టీడీపీ నేతలు సాగి వెంకటసుబ్బరాజు, బోయిడి వేణుగోపాల్‌, మోర్త భైరవమూర్తి, మోపూరి వెంకటేశ్వరరావు, వేగేశ్న భాస్కరరాజు పాల్గొన్నారు.

ఫ తాళ్లరేవు టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో గ్రామకమిటీ అధ్యక్షుడు సంగాడి కామేశ్వరరావు, కావూరి సత్యనారాయణల ఆధ్వర్యంలో 50కుటుంబాలు టీడీపీ తీర్థం తీసుకున్నారు. జి.వేమవరం సర్పంచ్‌ పుణ్యమంతుల సూరిబాబు, శ్రీనివాసరావుల నేతృత్వంలో వార్డుసభ్యురాలు యర్రంనీడి భవాని, తనుకుల రాజులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జల్లి తిరుపతిరావు, మోర్త వీరబాబు, పెయ్యల ప్రసాద్‌, మాతా రామకృష్ణ, వస్కా కృష్ణ, రేవు, కావూరి, బుడితి, దోనుపాటి, పాము, కమిడి, నల్లి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

రాక్షస పాలన అంతానికి ఓటు ఆయుధం కావాలి : దివ్య

తొండంగి: రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షసపాలన అంతానికి ప్రతిఒక్కరూ తమ ఓటును ఆయుధంగా ఉపయోగించాలని తుని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రావికంపాడులో జరిగిన బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మెర్ల రవీంద్రనాధ్‌ చౌదరి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి దివ్య కండవాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. టీడీపీ నేతలు మోతుకూరి వెంకటేష్‌, చింతంనీడి అబ్బాయి, యనమల రాజేష్‌, యనమల నాగేశ్వర్రావు, యనమల కృష్ణ, చొక్కా అప్పారావు, అరిగెల నర్శింహమూర్తి పాల్గొన్నారు.

జనసేనలో చేరికలు

సర్పవరంజంక్షన్‌: గొడారిగుంటకు చెందిన వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కౌన్సిల్‌ సభ్యు లు కలవల మరియమ్మ, కలవల కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో పలువురు తటస్థులు గురువారం నానాజీ నివాసం వద్ద జనసేన పార్టీలో చేరారు. వీరికి కాకినాడరూరల్‌ జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పార్టీ కండువాలువేసి ఆహ్వానించారు. చీడిగకు చెందిన గుత్తులనాగేశ్వరరావు, ఉదయ్‌స్వామిలు పార్టీలో చేరారు.

టీడీపీ-జనసేన ప్రభుత్వ స్థాపనే లక్ష్యం : జ్యోతుల నెహ్రూ

గండేపల్లి: టీడీపీ-జనసేన ప్రభుత్వ స్థాపనే లక్ష్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జగ్గంపేట టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలో మల్లేపల్లిలో గురువారం జ్యోతుల నెహ్రూ జనసేన నాయకులను కలిశారు. నెహ్రూ మా ట్లాడుతూ టీడీపీ, జనసేన కలయికతో పార్టీ బలపడిందన్నారు. జనసేన నాయకులతో గ్రామంలో పర్యటించారు. జనసేన నాయకులు నెహ్రూకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీఅధ్యక్షుడు పోతుల మోహనరావు, తెలగరెడ్డి భద్రరావు, రామకుర్తి నరసింహం, కాపు పాల్గొన్నారు.

కూటమి విజయానికి సహకరించండి : ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి నానాజీ

కరప: రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమి విజయానికి సహకరించాలని కాకినాడరూరల్‌ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు కోరారు. వేములవాడ శివారు సిరిగలపల్లిలంక గ్రామంలో గురువారం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. నానాజీ, సత్తిబాబు, అనంతలక్ష్మిలకు స్థానికులు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో ఆయా పార్టీల నాయకులు గుల్లిపల్లి శ్రీనివాసరావు, బోగిరెడ్డి గంగాధర్‌, మద్దూరి స్వామి, చీపురుపల్లి జయేంద్రబాబు, అప్పనపల్లి నారయ్య, పెంకే దుర్గారావు, కురుపూడి రాంబాబు, గుత్తుల నాగేశ్వరరావు, గుత్తుల తాతారావు, పాలిక వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

‘సత్యప్రభ విజయమే లక్ష్యంగా పనిచేయండి’

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సత్యప్రభ రాజా గెలిపే లక్ష్యంగా జనసేన, టీడీపీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మవరంలో ప్రతిభా పాఠశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం నియోజకవర్గ జనసేన, టీడీపీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వరుపుల తమ్మయ్యబాబులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం చేకూర్చేందుకు ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని అభ్యర్థి సత్యప్రభ రాజా చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా పనిచేయాలని ఆమెకోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణరాజు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి శేషారావు, జనసేన, టీడీపీ నాయకులు మేడిశెట్టి చంద్రకిరణ్‌, పెంటకోట మోహన్‌, నల్లల రామకృష్ణ, మేకల కృష్ణ పాల్గొన్నారు.

వైసీపీ నుంచి 100 మంది దళితులు టీడీపీలో చేరిక

కాజులూరు: కాజులూరు మండలం గొల్లపాలెంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు చుండ్రు వీర్రాజుచౌదరి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంపార్టీలో చేరారు. ఈ మేరకు రామచంద్రపురం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి వాసంశెట్టి సుభాష్‌ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శలపాక గ్రామంలో పలువురు దళిత మహిళలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దళిత నాయకులు పలివెల సోమరాజు, పలివెల శివ, పలివెల నానిబాబు, పలివెల నరసింహ, పలివెల సుమంత్‌, పలివెల కుమారి, కాండ్రకోట నాగదేవి, బుంగా సత్యవతి, మిరియాల వీరమ్మ, పలివెల ఎలిసమ్మ తదితరులు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో మండల టీడీపీ అద్యక్షుడు పేపకాయల బాబ్జీ, క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ వనుం వీరబ్రహ్మం, పోతుల మాధవ, అంగర కృష్ణ పాల్గొన్నారు.

పవన్‌ విజయం కోసం పాదయాత్ర

పిఠాపురం: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విజయం కోరుతూ 23వ తేదీన పట్టణంలోని సూర్యనారాయణమూర్తి ఆలయం నుంచి తొలి తిరుపతి వరకూ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు, మార్నీడి రంగబాబు, మాగాపు గొల్లబాబు, పిండి శ్రీను, పిడుగు శ్రీను, వనుము వీరబాబు, బాలిపల్లి బుజ్జిలు తెలిపారు. పవన్‌ను లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు.

Updated Date - Mar 22 , 2024 | 12:51 AM