Share News

సమ్మె విషయంలో ప్రభుత్వం పంతాలు మానుకోవాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:27 AM

మునిసిపల్‌ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం తన పంతాన్ని మానుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాఽథ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం మునిసిపల్‌ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో మునిసిపల్‌ ఆర్‌డీ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.

సమ్మె విషయంలో ప్రభుత్వం పంతాలు మానుకోవాలి

రాజమహేంద్రవరం సిటీ, జనవరి10: మునిసిపల్‌ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం తన పంతాన్ని మానుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాఽథ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం మునిసిపల్‌ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో మునిసిపల్‌ ఆర్‌డీ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. దీనిలో పాల్గొని రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ గత 9 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంతి జగన్‌ తన పంతాన్ని వీడితే మంచిదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మునిసిపల్‌ కార్మికులంటే ఏమిటో చూపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పడానికి అందరు సిద్దంగా ఉన్నారని చెప్పారు. మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నెక్కింటి సుబ్బారావు మాట్లాడుతూ చలో ఆర్‌డి కార్యాలయానికి ఉదయం నుంచి నాలుగు జిల్లాల నుంచి మునిసిపల్‌ కార్మికులు ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చారని చెప్పారు. అనంతరం ఆర్‌డీకి వినతిపత్రం అందించారు. యూనియన్‌ నేతలు భజంత్రీ శ్రీనివాస్‌, తడికొండ వాసు, కె మల్లేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు, ఏఐటీయూసీ నేతలు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 01:27 AM