Share News

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:46 AM

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుం దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు అన్నారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు

శ్రీప్రకాష్‌లో ముగిసిన రాష్ట్రస్థాయి టీటీ ర్యాంకింగ్‌ పోటీలు

పెద్దాపురం, జూన్‌ 10: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుం దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రధానం కార్యక్రమ ంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుంచి మంచి విద్యతోపాటు క్రీడలను భాగంగా చేసుకుని రోజూ నచ్చిన క్రీడలో సాధన చేయాలన్నారు. అంతర్జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు క్రీడాకోటా ద్వారా మంచి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కాకినాడ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.మోహన్‌బాబు మాట్లాడుతూ నేటికాలంలో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు క్రీడలను ప్రోత్సహించే విధంగా చూడాలన్నారు. పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇటువంటి క్రీడాపోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సాటిమేటి క్రీడాకారులకు తమ పాఠశాల వేదిక కావడం ఇంకా సంతోషాన్ని ఇస్తోందన్నారు. అనంతరం మెన్‌, ఉమెన్‌, బాయ్స్‌ విభా గంలో విజేతలకు రాజా సూరిబాబురాజు బహుమతులను అందజేశా రు. అనంతరం పాఠశాల డైరెక్టర్‌ విజయ్‌ప్రకాష్‌ చేతలుమీదుగా రాజా సూరిబాబురాజును పూలమాలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్క రించారు. ఈకార్యక్రమంలో సెవెన్‌హిల్స్‌ పేపర్స్‌మిల్స్‌ చైర్మన్‌ పి.రాఘ వారావు, తూతిక రాజు, చీఫ్‌ రిఫరీ రమణ, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:46 AM