Share News

యువహో క్రీడా పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:06 AM

ఆదివాసీ యువ తలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే ందుకు పోలీసు శాఖ యువహో పేరిట క్రీడా పోటీలను నిర్వ హిస్తున్నట్లు రంప చోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా గురువారం ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు గ్రామమైన చింతూరు మండలం, అల్లిగూడెంలో పోలీసు శాఖ వాలీబాల్‌ పోటీలను నిర్వహించింది.

యువహో క్రీడా పోటీలు ప్రారంభం

చింతూరు, జనవి 11 : ఆదివాసీ యువ తలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే ందుకు పోలీసు శాఖ యువహో పేరిట క్రీడా పోటీలను నిర్వ హిస్తున్నట్లు రంప చోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా గురువారం ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు గ్రామమైన చింతూరు మండలం, అల్లిగూడెంలో పోలీసు శాఖ వాలీబాల్‌ పోటీలను నిర్వహించింది. పోటీలను ఓఎస్‌డీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోటీలలో 40 జట్లు పాల్గొన్నాయని వీరిలో విజేతగా అల్లిగూడెం జట్టు నిలిచిందని, రెండో విజేతగా నారకొండ యువత బహుమతిని కైవసం చేసుకున్నట్లు చెప్పారు. మహిళా విభాగంలో ఆరు జట్లు పోటీలలో పాల్గొనగా వారిలో అల్లిగూడెం, సూరకుంట గ్రామాలు ఒకటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయన్నారు. వారికి నగదు బహుమతులు అందించినట్లు చెప్పారు. అదే దశలో తమ శాఖ నిర్వహించిన వైద్య శిబిరానికి 349 మంది హాజరై ఉచిత వైద్యాన్ని పొందారని ఓఎస్‌డీ తెలిపారు. ఆదివాసీ కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేసినట్లు చెప్పారు. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి నుంచి మల్లెంపేట, పేగ నుంచి జగ్గవరం వరకు తారు రోడ్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. పదప ఆయా గ్రామాలకు గాను ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. అల్లిగూడెం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే క్రమంలో ఆర్వో ప్లాంటు మంజూరు చేయించినట్లు చెప్పారు. విద్యుత్‌ సౌకర్యం లేని ఆదివాసీ గ్రామాలకు త్వరలోనే విద్యుత్‌ వెలుగులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో చింతూరు ఏఎస్పీ రాహుల్‌ మీనా, 42వ బెటాలియన్‌ కమాండెంట్‌ సురేష్‌కుమార్‌, సర్పంచ్‌ చంద్రయ్య, ఎంపీటీసీ నాగరాజు, రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని పలువురు సీఐ, ఎస్‌ఐలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 06:49 AM