ప్రత్యేక హోదాపై జగన్ ప్రశ్నించకపోవడం విచారకరం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:44 AM
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోదీని ప్రశ్నించకపోవడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు విమర్శించారు.

కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు
కాకినాడ(ఆంధ్రజ్యోతి), జనవరి 11: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోదీని ప్రశ్నించకపోవడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు విమర్శించారు. ఏలేశ్వరంలోని షిర్డీనగర్‌లో ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఉమ్మిడి వెంకట్రావు ఇంటివద్ద నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి పళ్లంరాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చిలుకూరి పాండురంగారావు మాట్లాడారు. యు.వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర కాంగ్రెస్ సెక్రటరీ పెద్దాడ సుబ్బారాయుడు, పీసీసీ సభ్యుడు ధర్నాల కోట శ్రీను, బీసీ సెల్ కో ఆర్డినేటర్ కొల్లు వీరగణేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొయ్యేటి సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.
‘వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు’
పిఠాపురం, జనవరి 11: రాష్ట్రంలో అధికార వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు తెలిపారు. పిఠాపురం పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం చెలికాని భావనరావు సభాసదన్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మేడిది శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జరిగిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పిఠాపురం పట్టణంలోని కోర్టుల వద్ద న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు పళ్లంరాజు సంఘీభావం తెలియజేశారు.
చెబుతామన్నారు.