Share News

స్పందన సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:47 AM

కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి స్పం దనకు 186 అర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి నిర్ణీత కాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. కె. మాధవీలత తెలిపారు.

స్పందన సమస్యలు పరిష్కరించాలి

రాజమహేంద్రవరం, జననవరి 29(ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి స్పం దనకు 186 అర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి నిర్ణీత కాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. కె. మాధవీలత తెలిపారు. అర్జీలు ఆన్‌లైన్‌లో 164, ఆఫ్‌లైన్‌లో 22 వచ్చాయన్నారు.వాటిలో రెవిన్యూకు 71, పంచాయతీరాజ్‌ 33, పోలీస్‌ 15, విద్యుత్‌ 12 ఉన్నట్టు తెలిపారు. కోలమూరు గ్రామానికి చెందిన 9 స్వయం సహాయక సంఘ సభ్యులకు అర్హత ఉన్నా కాతేరు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణాలు ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. నిడదవోలు మండలంలోని కలవచర్లకు చెందిన ఎలక నిర్మిల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేశారు. గోపాలపురం మండలం బుచ్చయ్యపాలెం గ్రామస్థులు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేశారు.వీటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొవ్వూరు మండలం ఆరికరేవులకు చెందిన కెఎస్‌ఎస్‌వీవీ సత్యనారాయణ తనకు 64శాతం వైకల్యం ఉందని, దివ్యాంగుల పెన్షన్‌ వర్తింప చేయాలని వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి సత్వర పరిష్కారంచూపాలని అధికారులకు సూచించారు.

ఎస్పీ స్పందనకు 20 అర్జీలు

రాజమహేంద్రవరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సిబ్బంది సమస్యలు సత్వరం పరిష్కరిస్తామని అడిషనల్‌ ఎస్పీలు రాజశేఖర్‌రాజు, వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పోలీసుల కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్ర మానికి పెద్ద ఎత్తున పోలీసులు, ఇతరులు తరలివ చ్చారు.ప్రజల నుంచి 20 అర్జీలు స్వీకరించారు. ఫిర్యా దుదారులతో మాట్లాడి చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

Updated Date - Jan 30 , 2024 | 12:47 AM