Share News

తూర్పు ఎస్పీగా నరసింహ కిషోర్‌

ABN , Publish Date - Jul 14 , 2024 | 12:49 AM

తూర్పుగోదావరి ఎస్పీగా డి.నరసింహ కిశోర్‌ నియమితులయ్యారు.ఇప్పటి వరకూ ఎస్పీగా విధులు నిర్వర్తించిన పి.జగదీశ్‌ని డీజీపీ కార్యాల యంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు విడుదలయ్యాయి.

తూర్పు ఎస్పీగా నరసింహ కిషోర్‌
నరసింహ కిషోర్‌

రాజమహేంద్రవరం, జూలై 13(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి ఎస్పీగా డి.నరసింహ కిశోర్‌ నియమితులయ్యారు.ఇప్పటి వరకూ ఎస్పీగా విధులు నిర్వర్తించిన పి.జగదీశ్‌ని డీజీపీ కార్యాల యంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు విడుదలయ్యాయి.రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్‌ లకు స్థాన చలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 2013 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన కిషోర్‌ తిరుమలలోని చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. 2017 బ్యాచ్‌కి చెందిన జగదీశ్‌ గతేడాది సెప్టెంబరు 8న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు..ప్రధాని పర్యటన.. సార్వ త్రిక ఎన్నికల వంటి కీలక సమయాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.ఎస్పీ జగదీశ్‌పై ఇసుక విషయంలో విమర్శలు ఉన్నాయి. అప్పటి కలెక్టర్‌ మాధవీలత వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ ఇసుక డ్రెడ్జింగ్‌ జరగడం లేదని కోర్టుకు సమ ర్పించిన నివేదికలో ఆయన కూడా వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తించా రనే ఆరోపణ ఉంది. ఎస్‌ఐల బదిలీల్లోనూ వైసీపీ నాయకుల మాట విని పోస్టింగ్‌లు ఇచ్చారని వినికిడి. ప్రజాప్రతినిధుల అభ్యర్థనకు నిఘా వర్గాల నివేదికకు పొంతన కుదరక పోవడమే బదిలీకి కారణంగా చెబుతున్నారు. జిల్లాకు వస్తున్న నరశింహ కిశోర్‌ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ధర్మాన ప్రసాదరావుకు అతి భక్తుడని సమాచారం.

Updated Date - Jul 14 , 2024 | 12:49 AM