Share News

ఎన్నికల విధులు బాధ్యతగా చేయాలి

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:07 AM

రాజ కీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల విధులు నిర్వర్తిం చాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ జగదీశ్‌ ఆదేశించారు.

ఎన్నికల విధులు బాధ్యతగా చేయాలి
పోలీస్‌ సిబ్బందికి ఎన్నికల విధులపై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ జగదీశ్‌

బోర్డర్‌ చెక్‌పోస్టులు బలోపేతం చేయాలి

అవగాహన సదస్సులో ఎస్పీ జగదీశ్‌

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాజ కీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల విధులు నిర్వర్తిం చాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ జగదీశ్‌ ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియో గించుకునే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి, ఎన్నికల ప్రక్రియలపై పోలీస్‌ అధికారులకు ఆదివారం నిర్వహించిన అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సమా వేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల నియమావళిని వివరించా లన్నారు. గ్రామ పెద్దలతో శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి,సారా,మద్యం, నగదు తదితర వాటి రవాణా అరికట్టడానికి బోర్డర్‌ చెక్‌ పోస్టులను బలోపేతం చేయాలన్నారు. ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి వాటి నుంచి ఎన్నికల అధికారులు, ఓటర్లకు భద్రత కల్పించాలని తెలిపారు. లైసెన్స్‌లేని ఆయుధాలు, మందుగుండు సామగ్రి సీజ్‌ చేయాలన్నారు. రౌడీ షీట్లు,పరారీలో ఉన్న నేరస్తులు, దూకుడుగా వ్యవహ రించే కార్యకర్తలు, కుల/ మతపరమైన వ్యక్తులపై నిరం తర నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీస్‌ శాఖలోని అందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్ని కల సమయంలో కేసుల నమోదు, కోర్టు ముందు ఉంచే ప్రక్రియ తదితర విషయాలపై ఏడీజే కోర్టు పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ బీవీఎస్‌ ప్రసాదరావు వివరించారు. కార్యక్రమం లో డీఎస్పీలు,సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:07 AM