సోమసుందర్ సాహిత్యం.. నేటి తరానికి తెలియజేయాలి
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:47 AM
వజ్రాయుధకవి ఆవంత్స సోమసుందర్ సాహిత్యా న్ని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత సాహి తీవేత్తలపై ఉందని ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) తెలుగు సలహా మండలి కన్వీనర్ సి.మృణాళిని అన్నారు.
ఆవంత్స శత జయంతి సభలో సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ మృణాళిని
పోర్టుసిటీ (కాకినాడ), అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): వజ్రాయుధకవి ఆవంత్స సోమసుందర్ సాహిత్యా న్ని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత సాహి తీవేత్తలపై ఉందని ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) తెలుగు సలహా మండలి కన్వీనర్ సి.మృణాళిని అన్నారు. కాకినాడ గాంధీ భవన్‌లో సోమసుందర్ శత జయంతి సభను సా హిత్య అకాడమి, క్రియా సొసైటీ సంయుక్త ఆధ్వ ర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో మృణాళిని మాట్లాడుతూ సోమసుందర్ 100కుపైగా పుస్తకాలు రాశారన్నారు. ప్రముఖ సా హితీవేత్త చందు సుబ్బారావు మాట్లాడుతూ సోమ సుందర్ ఆత్మకథలో ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఉన్నాయన్నారు. జీవితచరిత్ర అంటే ప్రతి సంఘటన ఉండాలని ఆయన కోరుకు నేవా రని, ఆయనతో అప్పట్లో సన్నిహితంగా మెలిగిన స్నేహితురాలి గురించీ జీవిత చరిత్రలో రాయడం ఆయనకే చెల్లిందన్నారు. డాక్టర్ జి.సీతారామస్వా మి మాట్లాడుతూ సోమసుందర్ పేదల వైపు నిల బడి అభ్యుదయకవిగా పేరు తెచ్చుకున్నారన్నారు. సదస్సులో క్రియా సొసైటీ కార్యదర్శి ఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథరావు, సాహితీవేత్తలు నందిని సిధారెడ్డి, ఎన్.ఈశ్వరరెడ్డి, బొల్లోజు బాబా, వాడ్రేవు వీర లక్ష్మీ దేవి, కస్తూరి నాగమురళీశంకర్, నండూరి రాజగో పాల్, ఆర్.సీతారామారావు, మేకా మన్మథరావు, శిఖామణి, మేకా మన్మధరావులు పాల్గొన్నారు.