Share News

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:05 AM

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గురువారం సాయంత్రం 4గంటల నుంచి 5:30ల వరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సువర్ణరాజు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

  • కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్‌ ధర్నా

కొవ్వూరు, ఫిబ్రవరి 29: ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గురువారం సాయంత్రం 4గంటల నుంచి 5:30ల వరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సువర్ణరాజు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవకు అందజేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డీడీ రావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏలు, పీఎఫ్‌, సరెండర్‌ లీవులు, మెడికల్‌ బిల్లుల బకాయిలు విడుదల చేయాలి. ఉపాధ్యాయుల నియామకాలను రెగ్యులర్‌ టైమ్‌స్కేల్‌లో నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, డ్రాఫ్‌ అవుట్స్‌ పెరుగుతున్నారని, గతంలో మాదిరిగా ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్‌ సుభాకర్‌, వి.విష్ణు, ఎస్‌కే సలీమ్‌, అనితాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 01:06 AM