సంఘ సంస్కరణ ఉద్యమ ప్రాధాన్యం గుర్తించాలి’
ABN , Publish Date - May 28 , 2024 | 12:36 AM
సమాజ మార్పు కోరుకునేవారు ముందుగా సంఘ సంస్క రణ ఉద్యమ ప్రాధాన్యం గుర్తించాలని ప్రజాసాంస్కృతికోద్యమ రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం అన్నారు.
కాకినాడ సిటీ, మే 27: సమాజ మార్పు కోరుకునేవారు ముందుగా సంఘ సంస్క రణ ఉద్యమ ప్రాధాన్యం గుర్తించాలని ప్రజాసాంస్కృతికోద్యమ రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం అన్నారు. కచేరీపేటలోని యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకట రత్నం నాయుడు (ఆర్‌వీఎన్) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలుగు నేలపై సంఘ సంస్కరణోద్యమాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి జి.ప్రభాకరవర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. బ్రిటీష్ కాలంలో భారత సమాజంలో ఉన్న సతీసహగమనం వంటి అమానుష దురాచారాలపై రాజా రామ్మోహన్‌రాయ్ వంటి మహనీయులు సంఘ సంస్కరణ ఉద్యమాలు చేశారన్నారు. తెలుగు నాట వేమన, వెంకటరత్నం నాయుడు, బ్రహ్మనాయుడు వంటి సంఘ సంస్కర్తలు చేసిన కృషి ఎనలేనిదన్నారు. అతిథిగా హాజరైన జన విజ్ఞానవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ మాట్లాడుతూ అన్నిస్థాయిల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలన్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలతో పాటు సామాజిక, సాంస్కృతిక విషయాల్లోను ప్రజాస్వామ్య భావజాలం పెరగాలన్నారు. సదస్సుకు ఆర్‌వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్.గోవిందరాజులు స్వాగతం పలకగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాం, ప్రజాసంఘాల నాయకు లు పా ల్గొన్నారు. తొలుత వెంకటరత్నంనాయుడు చిత్రపటానికి సీతారాం, స్టాలిన్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు.