విత్తన దుకాణాల్లో జిల్లా అధికారుల బృందం తనిఖీలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:04 AM
కాకినాడజిల్లా గొల్లప్రోలు పట్టణం, మండల పరిధిలోని గ్రామాల్లోని విత్తనాలు, ఎరు వులు, పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయశాఖ జిల్లా అధికారుల బృందాలు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

గొల్లప్రోలు, జూన్ 11: కాకినాడజిల్లా గొల్లప్రోలు పట్టణం, మండల పరిధిలోని గ్రామాల్లోని విత్తనాలు, ఎరు వులు, పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయశాఖ జిల్లా అధికారుల బృందాలు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. పత్తి విత్తనాలు విక్రయిస్తున్న షాపుల్లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, ప్రిన్సిపల్ రిజిస్టర్లు సహా ఇతర రికార్డులు తనిఖీ చేశారు. లోపాలు గుర్తించి షాపుల్లో రూ.4.89లక్షల విలువైన 534 పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయాలు నిలిపివేస్తూ స్టాప్‌సేల్ ఉత్తర్వులు జారీ చేశారు. విత్తన విక్రయాల్లో నిబంధనలు పాటించకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా వనరుల కేంద్రం(పెద్దాపురం) డిప్యూటీ డైరెక్టరు బీవీఎస్ హరి, జీబీ కరుణాకర్, వెంకటలక్ష్మిలు పాల్గొనగా, వారి వెంట గొల్లప్రోలు మండల వ్యవసాయాధికారి కేవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
305 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం
జగ్గంపేట, జూన్ 11: అక్రమంగా తరలిస్తున్న పీడీ ఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నా రు. ఏపీ39 టీక్యూ 3229 టాటా ఐచర్ వాహనంలో పీడీఎస్ బియ్యం వెళుతున్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తనిఖీ చేయగా 305 బస్తాల 15,250కిలోల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. పీడీఎస్ బియ్యం పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడుకు చెందిన బి.లచ్చబాబుకు చెందినవి. వ్యా న్ డ్రైవర్ నామాల వీరబాబు వెలుగు గంగరాజుదిగా గుర్తించారు. ఈ బియ్యాన్ని పిఠా పురం నామాల వీరబా బు జగ్గంపేటలోని పౌలీ్ట్ర ఫార్‌మ్‌లకు రవాణా చేస్తుండగా సివిల్ సప్లయిస్ అధికార్లు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం సుమారు రూ.10,93,875లు విలువైన 15,250కేజీలు. అక్ర మంగా తరలిస్తున్నందుకు 6ఏ కింద కేసు నమోదు చేసి బియ్యం స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుకు పోలీస్‌స్టేషన్‌కు సిఫార్సు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు భార్గవమహేష్‌వలి, వీరబాబు, సీఎస్‌డీటీ కృష్ణ పాల్గొన్నారు.