Share News

యానాంలో ప్రజాఉత్సవాలను ఎవరూ ఆపలేరు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:59 AM

యానాంలో ప్రజాఉత్సవాలను ఎవరూ ఆపలేరు

యానాంలో ప్రజాఉత్సవాలను ఎవరూ ఆపలేరు

యానాం, జనవరి 8: యానాం ప్రజాఉత్సవాలను ఎవరూ ఆపలేరని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో సోమవారం జరిగిన యానాం ప్రజాఉత్సవాలు, ఫలపుష్ప ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. 20ఏళ్లుగా జరుగుతున్న ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చూడాలే తప్ప నిలుపుదల చేయాలనుకోవడం సరికాదన్నారు. యానాంలో పెండింగ్‌ సమస్యలను మంగళవారం సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. యానాంలో రెండు రోజుల క్రితం మూసిన పేకాట క్లబ్‌ను మొక్కుబడిగా కాకుండా శాశ్వతంగా మూతపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పేకాట క్లబ్‌లకు అనుమతుల విషయంలో రూ.లక్షల్లో లం చాలు తీసుకున్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లంచాలకు సంబంధించి ఆధారాలు ప్రభుత్వానికి అందిస్తామన్నారు. యానాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా అధికారులు మల్లాడిని సత్కరించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయగం, భక్తవత్సలం, వ్యవసాయశాఖ డీడీ శివసుబ్రహ్మణ్యం, మున్సిపల్‌ కమిషనర్‌ ఆరుల్‌ ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:59 AM