Share News

అద్వితీయమైన రోజు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:40 AM

తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాల్లో రెండో రోజు శుక్రవారం.. ఏకాదశి.. కావడంతో అసెంబ్లీ స్థానాలకు పెద్ద సం ఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

అద్వితీయమైన రోజు
రాజమహేంద్రవరం లోక్‌సభకు నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థిని పురందేశ్వరి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాల్లో రెండో రోజు శుక్రవారం.. ఏకాదశి.. కావడంతో అసెంబ్లీ స్థానాలకు పెద్ద సం ఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పుగోదా వరి జిల్లాలో రెండో రోజు 12 నామినేషన్లు దాఖల య్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం 18 నామి నేషన్లు దాఖలైనట్టు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం లోక్‌ సభ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థినిగా దగ్గు బాటి పురందేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అనపర్తి నుంచి తెలు గుదేశం అభ్యర్థిగా నల్లమిల్లి మహాలక్ష్మి, కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వేంకటేశ్వరరావు, నిడదవోలు నుంచి జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక వైసీపీ నుంచి రాజానగరం అభ్యర్థిగా జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్‌, గంధం రాజేశ్వరి, గోపాలపురం వైసీపీ అభ్యర్థినిగా మంత్రి తానేటి వనిత, జొన్నకూటి బా బాజీరావు నామినేషన్లు దాఖలు చేశారు. కొవ్వూరు కాంగ్రెస్‌ అభ్యర్థినిగా అరిగెల అరుణకుమారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బొంత శ్యామ్‌ రవిప్రకాష్‌, నిడదవోలు నుంచి ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ (ఏఐఎఫ్‌బీ) అభ్యర్థిగా కస్తూరి సత్యప్రసాద్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

కోనసీమలో 10..

అమలాపురం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన రెండో రోజు శుక్రవారం అసెంబ్లీ స్థానాలకు పదిమంది నామినేషన్లు దాఖలుచేశారు. అమలాపురం లోక్‌సభకు రెండో రోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల నుంచి పది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆర్డీవో కార్యాలయంలో రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో బీఎస్పీ నుంచి మాతా సుబ్రహ్మ ణ్యం ఒక సెట్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి జిత్తుక వెంకట్రావు ఒక సెట్‌ నామినేషన్లు వేశారు. ముమ్మిడివరం నియో జకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నుంచి పొన్నాడ నీరజ ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పాలెపు ధర్మారావు, సత్తిరాజు ఎస్‌వీయూవీఆర్‌ఎస్‌ స్వామి స్వతంత్ర అభ్యర్థిగా, బీర రాజకుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో సెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. మండపేట నుంచి నందికోళ్ల రాజు, నవతరం పార్టీ నుంచి మందపల్లి రవి స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షుశుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.

కాకినాడ జిల్లాలో...

కలెక్టరేట్‌(కాకినాడ), ఏప్రిల్‌19: కాకినాడ జిల్లా లో శుక్రవారం మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ లోక్‌సభకు రెండు నామినేషన్లు వేశారు.ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన చందక అనూష భారత చైతన్య యు వజన పార్టీ (బీసీవై) తరపున కాకినాడ లోక్‌సభకు నామినేషన్‌ దాఖలు చేశారు. గిడ్ల సింహాచలం కాకినాడ లోక్‌సభకు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. వీరిద్దరూ నామినే షన్లను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌కు అందజేశారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. తుని నియోజకవర్గానికి లాలం లోవరాజు ఇండిపెండెంట్‌గా, ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థి వరు పుల సుబ్బారావు నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ రూరల్‌ నుంచి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) కూటమి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మిగిలిన పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థినిగా మిరియాల శిరీషాదేవి నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Apr 20 , 2024 | 12:40 AM