Share News

బీటలు వారిన రోడ్డు

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:46 PM

ఉండ్రాజవరం-తణుకు ఆర్‌అండ్‌బీ సిమెంట్‌ రోడ్డు కొన్నేళ్లుగా పలు చోట్ల బీటలు తీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీటలు వారిన ప్రదేశం నుంచి వెళ్లేటపుడు వాహనాలు గాడిలో పడి ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు.

బీటలు వారిన రోడ్డు

ఉండ్రాజవరం, ఆగస్టు 24: ఉండ్రాజవరం-తణుకు ఆర్‌అండ్‌బీ సిమెంట్‌ రోడ్డు కొన్నేళ్లుగా పలు చోట్ల బీటలు తీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీటలు వారిన ప్రదేశం నుంచి వెళ్లేటపుడు వాహనాలు గాడిలో పడి ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. అప్పడప్పుడు ఆర్‌అండ్‌బీ అఽధికారులు తారు వేసినా దాని వల్ల ఉపయోగం ఉండడంలేదు. నిత్యం క్వారీ లారీలు వెళుతున్న ఈ రోడ్డులో సిమెంట్‌ రోడ్డుపై ఉన్న గోతులు, విడిపోయిన జాయింట్లు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఉండ్రాజవరం, మోర్త, దమ్మెన్ను గ్రామాల వరకు ఉన్న రోడ్డులో గోతులు నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత పెద్దవి మారి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డులో గోతులు పూడ్చాలని కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:46 PM