పండ్ల తోటల సాగుకు నూతన యాజమాన్య పద్ధతులు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:02 AM
కొవ్వూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా పండ్ల తోటలు సాగుచేసే రైతులకు ఎప్పటికప్పుడు నూతన యాజమాన్య పద్ధతులు అందజేస్తున్నట్టు అఖిల భారత సమన్వయ పం డ్ల పరిశోధనా ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రకాష్ పాటి ల్ అన్నారు. శనివారం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఆయన పరిశీలిం

అఖిల భారత సమన్వయ పండ్ల పరిశోధనా ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రకాష్ పాటిల్
కొవ్వూరు ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిశీలన
పరిశోధన ప్రగతిపై శాస్త్రవేత్తలతో సమీక్ష
కొవ్వూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా పండ్ల తోటలు సాగుచేసే రైతులకు ఎప్పటికప్పుడు నూతన యాజమాన్య పద్ధతులు అందజేస్తున్నట్టు అఖిల భారత సమన్వయ పం డ్ల పరిశోధనా ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రకాష్ పాటి ల్ అన్నారు. శనివారం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఆయన పరిశీలించి ఏడాదిగా జరుగుతున్న పరిశోధన ప్రగతిపై శాస్త్రవేత్తలతో సమీక్షించారు. పండ్లలో కొత్త రకాల ఉత్పత్తి, వేరే ప్రాంతాల్లో విడుదల చేసిన వంగడాలు ఈ ప్రాం తంలో సాగుకు అనుకూలతలు, సాగులో నూత న యాజమాన్య పద్ధతులు, అరటిని ఆశించే తెగు ళ్లను ఎదుర్కోవడానికి చేస్తున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. పరిశోధనా ఫలితాలు ఎం తవరకు రైతులకు అందుతున్నాయో తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పండ్ల తోటలు సాగుచేసే రైతులు నష్ట పోకుండా పరిశోధనలు జరుపుతున్నామన్నారు. ఈ పరిశోధనలకు కేం ద్రం నుంచి 75 శాతం, రాష్ట్రం నుంచి 25శాతం నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కడప జిల్లా అనంతరాజుపేట, వెంకట్రామన్నగూడెం, కొవ్వూరు 4 కేం ద్రాల్లో అరటి, పనస, సపోట, మామిడి, బొప్పా యి, జామ, నిమ్మ జాతికి చెందిన పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. సాగులో రసాయనాలు తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను కనుగొంటున్నామన్నారు. ప్రతి రెండేళ్లకు యూనివర్శిటీ నుంచి నూతన యాజమాన్య పద్ధతులపై ఉద్యాన పంచాంగం (డైరీ), పుస్తకాలను తయారుచేసి రైతులకు అందజేస్తున్నామన్నారు. పరిశోధనల అనంతరం పరీక్ష చేసి వచ్చిన ఫలితాలపై రైతు లు సంతృప్తి చెందితే అధికసంఖ్యలో మేలైన వం గడాలను తయారుచేసి అందజేస్తున్నామన్నారు.
రెండేళ్లలో మేలైన డ్రాగన్ ఫ్రూట్
వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ డైరెక్టర్ ఎం.మాధవి మాట్లాడుతూ కోనసీమ జిల్లా అత్రే యపురం మండలం పద్దిపర్రులో రైతు 3 ఎకరాల్లో అవకాడో పంట సాగు చేస్తున్నారన్నారు. డ్రాగన్ ప్రూట్, అవకాడో, రాంభూటన్ పండ్లకు సం బంధించి వెంకట్రామన్నగూడెంలో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రైతులు సాగుచేస్తున్న డ్రాగన్ ప్రూట్ తోటల్లో చీడపీడలతో పాటు, పండ్ల సైజు చిన్నదిగా ఉండడం, నాణ్యత వంటి అంశాలపై మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నామన్నారు. మరో రెండేళ్లలో మేలైన డ్రాగన్ ఫ్రూట్ వంగడాలను రైతులకు అందజేస్తామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో, వాతావరణ మార్పులు కారణంగా సంభవించే సమస్యలు, ప్రస్తుతం రైతులు సాగులో ఎదుర్కొంటున్న సమస్యలపై 20 కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి రైతులకు సూచనలు ఇస్తున్నామన్నారు. దేశం మొత్తంలో భారతీయ సమన్వయ పరిశోధన మండలి పరిధిలో ఉష్ణ మండలం, సమ ఉష్ణ మండలంలో పండ్లతోటలపై పరిశోధనలు చేసి గ్రూపు సమావేశాల్లో శాస్త్రవేత్తలు పరిశోధనా ఫలితాలను ఒక రికొకరు షేర్ చేస్తున్నామన్నారు. కొవ్వూరు ఉద్యా న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పి.లలితా కామేశ్వరి మాట్లాడుతూ ఐదేళ్లుగా ఉమ్మడి ఉభ య గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో రైతులకు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆదివారం మారేడుమిల్లిలో క్షేత్ర సందర్శనకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు వి.శివకుమార్, ఎ.స్నేహలత, కె.రవీంద్రకుమార్ ఉన్నారు.