Share News

నిలిపివేసిన పథకాల సొమ్ము జమచేయాలి

ABN , Publish Date - May 16 , 2024 | 01:34 AM

సార్వత్రిక ఎన్నికల కారణంగా నిలిపివేసిన పథకాల సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తక్షణం జమ చేయాలని డిమాండు చేస్తూ సీపీఎం, సీపీఐ నాయకులు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

నిలిపివేసిన పథకాల సొమ్ము జమచేయాలి

అమలాపురం టౌన్‌, మే 15: సార్వత్రిక ఎన్నికల కారణంగా నిలిపివేసిన పథకాల సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తక్షణం జమ చేయాలని డిమాండు చేస్తూ సీపీఎం, సీపీఐ నాయకులు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాల నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కినా లబ్ధిదారులకు ఇంతవరకు నగదు జమ కాలేదన్నారు. ఈనెల10,11 తేదీల్లో నగదు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధపడగా ఎన్నికల కారణంగా పోలింగ్‌ ముగిసే వరకు ఎలాంటి నగదు బదిలీ చేయరాదని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పోలింగ్‌ ముగిసినందున వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకుడు కె.సత్తిబాబు, నూకల బలరామ్‌ కోరారు.

Updated Date - May 16 , 2024 | 08:23 AM