Share News

అలరించిన సత్యహరిశ్చంద్ర నాటకం

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:14 PM

ప్రత్తిపాడు, జనవరి 17: మండలంలోని ధర్మవరంలో గౌరీశంకర్ల 87వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవార రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నిర్వహించిన సత్యహరిశ్చంద్ర నాటకం ఆకట్టుకుంది. మొదటి సత్యహరిశ్చంద్రగా తెనాలికి చెందిన ఉప్పరాజేశ్వరరావు,రెండో సత్యహరిశ్చంద్రగా డీవీ సుబ్బారావు పోటా

అలరించిన సత్యహరిశ్చంద్ర నాటకం
సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన

ప్రత్తిపాడు, జనవరి 17: మండలంలోని ధర్మవరంలో గౌరీశంకర్ల 87వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవార రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నిర్వహించిన సత్యహరిశ్చంద్ర నాటకం ఆకట్టుకుంది. మొదటి సత్యహరిశ్చంద్రగా తెనాలికి చెందిన ఉప్పరాజేశ్వరరావు,రెండో సత్యహరిశ్చంద్రగా డీవీ సుబ్బారావు పోటాపోటీగా పద్యధారణ, హావభావాలతో అలరించారు. చంద్రమతిగా రాజాంకు చెందిన కిలారి లక్ష్మి చక్క టి గాత్రధారణతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడవి సీను, స్మశాన ఘట్టాల్లో చంద్రమతి అభినయాలు ప్రేక్షకులను కన్నీటి పర్యాంతం చేశాయి. ఈ నాటకానికి ముందు నడకుదురు అనంతలక్ష్మి అనే బాలిక అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేశారు. కళాకారులకు, దాతలకు నిర్వాహక కమిటీ సభ్యులు జ్ఞాపికలు అందజేశారు.

Updated Date - Jan 17 , 2024 | 11:14 PM