Share News

భక్తజనసంద్రంగా సత్యదేవుడి సన్నిధి

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:58 AM

సత్యదేవుడి సన్నిధి శనివారం మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా అశేష భక్తజనంతో పోటెత్తింది. శుక్రవారం రాత్రికే రత్నగిరికి చేరుకున్న భక్తులకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల నుంచి వ్రతాలు మూడుగంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు.

భక్తజనసంద్రంగా సత్యదేవుడి సన్నిధి

7311 వ్రతాలు, రూ.70 లక్షల ఆదాయం

అన్నవరం, ఫిబ్రవరి 24: సత్యదేవుడి సన్నిధి శనివారం మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా అశేష భక్తజనంతో పోటెత్తింది. శుక్రవారం రాత్రికే రత్నగిరికి చేరుకున్న భక్తులకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల నుంచి వ్రతాలు మూడుగంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. శనివారం ఒక్కరోజు 7311 వ్రతాలు జరగగా వివిధ విభాగాల ద్వారా సుమారు రూ.70లక్షల ఆదాయం సమకూరింది. రద్దీ నేపథ్యంలో అంత్రాలయ ప్రదక్షణ దర్శనాలు నిలుపుదల చేశారు. ఎక్కడికక్కడ క్యూలైన్‌లలో భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించారు. ఎండలు మండుతుండడంతో షామియానాలు పూర్తిస్థాయిలో లేక భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఈవో రామచంద్రమోహన్‌ సమీక్షించారు.

Updated Date - Feb 25 , 2024 | 10:03 AM