Share News

మట్టి తవ్వకాల అడ్డగింపు

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:42 AM

టేకి గ్రామ ఆయకట్టు పరిధిలో అనుమతులు లేకుండా నల్లూరు, టేకి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మట్టిని తరలిస్తున్నారు.

మట్టి తవ్వకాల అడ్డగింపు

కపిలేశ్వరపురం, జూన్‌ 1: టేకి గ్రామ ఆయకట్టు పరిధిలో అనుమతులు లేకుండా నల్లూరు, టేకి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మట్టిని తరలిస్తున్నారు. వ్యవసాయక్షేత్రం నుంచి మట్టిని తవ్వి రోడ్డు పక్కన డంప్‌ చేస్తుండగా రెవెన్యూ అధికారులు స్పందించారు. ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్‌ను వీఆర్‌వో ఎ.మల్లేష్‌, ఆర్‌ఐ శ్రీనివాసరావు సీజ్‌చేసి, అంగర పోలీసులకు శుక్రవారం రాత్రి స్వాధీనపర్చారు. ఈవిషయమై మైన్స్‌ అధికారులు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆర్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. మాచర గ్రామపరిధిలో మట్టి తవ్వకాలు జరిగినట్లు వీఆర్‌వో రాజారత్నం పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. సొంత భూముల్లో మట్టి తరలింపునకు రైతులు తహసీల్దార్‌ వద్ద అనుమతులు పొందకపోతే చర్యలు తప్పవని ఆర్‌ఐ హెచ్చరించారు.

Updated Date - Jun 02 , 2024 | 08:20 AM