Share News

ఇసుక అక్రమాలే లేవట?

ABN , Publish Date - May 21 , 2024 | 12:31 AM

జిల్లాలో ఇసుక అక్రమాలు లేవు. ప్రస్తుతం 16 ఓపెన్‌ రీచ్‌లలో తవ్వ కాలు జరగడంలేదని జిల్లా అఽధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక సిద్ధం చేశా రు.

ఇసుక అక్రమాలే లేవట?

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇసుక అక్రమాలు లేవు. ప్రస్తుతం 16 ఓపెన్‌ రీచ్‌లలో తవ్వ కాలు జరగడంలేదని జిల్లా అఽధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక సిద్ధం చేశా రు. ఈ నివేదికను మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ ద్వారా సుప్రీంకోర్టుకు పంపించనున్నారు. ఆదివారం ఉరుకులు, పరుగులతో వర్షంలో తడుస్తూ అధికారులు ర్యాంపులను పరిశీలించిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రస్తుతం ఇసుక తవ్వకాలు ఆగిపోయినప్పటికీ..అప్పటివరకూ జరిగిన తవ్వకాల ఆన వాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని అధికారులు పట్టించుకోలేదు. పెద్దపెద్ద గుట్టలుగా అక్రమ తవ్వకాల ఇసుక స్టాక్‌ పాయింట్లు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా వాటిని పట్టించుకోలేదు. ర్యాంపుల సమీపంలో ఈ గుట్టలు ఉన్నా ఏ మాత్రం అక్రమాలు జరగలేదని అఽధికారులు నివేదిక సిద్ధం చేయడం గమనార్హం. ఇసుక దోపీడీపై అధికారులు విచారణ చేసి ఇంత వరకూ ఏమి జరిగిందో కూడా నివేదికలో ఇవ్వాలి. కానీ అక్కడ ఏమీ జరగడం లేదని మాత్రమే ఇవ్వడం గమనార్హం. అంటే అధికార వైసీపీ ఒత్తిడికి అధికారులు ఎంతగా భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Updated Date - May 21 , 2024 | 12:31 AM