డీఎస్‌పాలెం ర్యాంపుపై టాస్క్ ఫోర్స్ దాడి
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:09 AM
పి.గన్నవరం మండలంలో నిబంధనలకు విరు ద్ధంగా గోదావరి తీరం వెంబడి సీఆర్‌జెడ్ పరిఽ దిలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారని, ర్యాం పులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన ఎంపీటీసీ ఆది మూలం సూర్యనారాయణమూర్తి కలెక్టరేట్, అమ రావతిలోని పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక)లో ఫిర్యాదు చేశారు.

పి.గన్నవరం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పి.గన్నవరం మండలంలో నిబంధనలకు విరు ద్ధంగా గోదావరి తీరం వెంబడి సీఆర్‌జెడ్ పరిఽ దిలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారని, ర్యాం పులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన ఎంపీటీసీ ఆది మూలం సూర్యనారాయణమూర్తి కలెక్టరేట్, అమ రావతిలోని పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక)లో ఫిర్యాదు చేశారు. దీంతో శనివా రం సాండ్‌టాస్క్ ఫొర్స్ అధికారులు పి.గన్నవరం శివారు డీఎస్‌పాలెంలో ఇసుక ర్యాంపుపై దాడు లు నిర్వహించారు. ర్యాంపులో ఒక ట్రాక్టర్‌ను, పోలీస్‌స్టేషన్ సమీపంలో రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు మైన్స్ అధికారులు తెలి పారు. మైన్స్ అధికారులు ఇసుక ర్యాంపులోకి చేరుకోవడంతో అక్కడ పదుల సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లు ఇసుకను అక్కడికక్కడే దిగుమతి చేసు కుని ర్యాంపు నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఖాళీ ట్రాక్టర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ర్యాంపు నడుస్తోందని, ఇసుక కోసం వచ్చామని ఖాళీ ట్రాక్టర్లపై ఏవిధంగా కేసులు నమోదు చేస్తారని ఆందోళనచేశారు. దీంతో అధికారులకు, ట్రాక్టర్ డ్రైవర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. డ్రైవర్లు ఇచ్చిన నివేదికను లిఖిత పూర్వకంగా తీసుకుని ఖాళీట్రాక్టర్లను వదిలిపెట్టారు. దాడుల్లో మైన్స్ ఆర్‌ఐ సుజాత, హెడ్‌వర్క్స్ జేఈ ఏ.దుర్గా నాయు డు, ఏఎస్‌ఐ ఎన్.పట్టాభిరామయ్య, ఆర్‌ఐ వి.డాం గే, వీఆర్వో కోరుకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘