Share News

ఇసుక ర్యాంపులో బాటచార్జీల బాదుడు

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:55 AM

సామాన్యులపై ప్రభుత్వం మరో బాదుడు మొదలుపెట్టింది. మునుపెన్నడు లేనివిధంగా ర్యాం పుల్లో బాటచార్జీల పెంచేశారు.

ఇసుక ర్యాంపులో బాటచార్జీల బాదుడు

బాట నిర్వహణ పేరుతో దోపిడీ.. వ్యతిరేకించిన వాహన యజమానులు.. నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు

ఆలమూరు, జనవరి20: సామాన్యులపై ప్రభుత్వం మరో బాదుడు మొదలుపెట్టింది. మునుపెన్నడు లేనివిధంగా ర్యాం పుల్లో బాటచార్జీల పెంచేశారు. ట్రాక్టర్‌ నుంచి భారీ లారీల వరకు ఏ వాహనానికీ మినహాయింపు లేకుండా చార్జీలు వసూ ళ్లు మొదలుపెట్టారు. దీంతో వాహనదారులు ఈ విధానాన్ని వ్యతిరేకించి ఉభయగోదావరి జిల్లాల్లో ర్యాంపుల వద్ద నిరసన వ్యక్తంచేసి వాహనాలను నిలుపుదల చేశారు. ర్యాంపుల్లో ఇసుక యూనిట్‌ లేదా టన్ను ఆధారంగా చెల్లింపులు జరిగేవి. అయితే శనివారం 20 నుంచి కొత్త విధానాన్ని ర్యాంపు నిర్వాహకులు తీసుకొచ్చారు. ప్రస్తుతం టన్నుల ధరతోపాటు రవాణా చార్జీలను మాత్రమే వారి వద్ద నుంచి తీసుకోవడం జరుగుతుందని, ఈ అదనపు చార్జీలతో వినియోగదారుడు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని, అందుకునే తాము పూర్తిగా బాటచార్జీల వసూళ్లు విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వాహనదారులు చెప్పారు. చార్జీ లు తగ్గించేంతవరకు ర్యాంపుల్లో ఎగుమతులు చేసుకునేది లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో శనివారం జొన్నాడ ఇసుక ర్యాంపులో తవ్వకాలు నిలిచిపోయాయి.

గోపాలపురం ర్యాంపులో..

రావులపాలెం, జనవరి 20: ఇసుక చార్జీల పెంపుపై లారీ యూనియన్‌ నాయకులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు. గోపాల పురం ర్యాంపునకు చేరుకున్న వాహనాదారులు, లారీ యూని యన్‌ నాయకులు ధరలు పెంపును నిరసిస్తూ శనివారం ఇసుక రవాణాను నిలుపుదల చేశారు. నిరసన తెలుపుతున్న వారికి టీడీపీ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, గ్రామపార్టీ అధ్యక్షుడు అధికారి నాగుతోపాటు టీడీపీ నాయ కులు సంఘీభావం తెలిపారు. చార్జీలు తగ్గించే వరకు నిరసన కొనసాగిస్తామని లారీ యూనియన్‌ నాయకులు తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 12:55 AM