Share News

ఇసుక..కష్టాలు!

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:39 AM

సో..శాడ్‌.. సమస్య చేతల్లోనే ఉంది.. అయినా పరిష్కారానికి మాత్రం ఎందుకో చేతలు రావడం లేదు.. ఒక పక్కన ప్రజలు ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారుల్లో మాత్రం ఎక్కడా చలనం లేదు.

ఇసుక..కష్టాలు!
ఇసుక

సర్కారు నుంచి రైట్‌ రైట్‌

అధికారుల నుంచి నో సిగ్నల్‌

నేటికీ ఇసుకకు ఇబ్బందులే

అందుబాటులోకి రాని వైనం

జిల్లాలో 9 ర్యాంపులు గుర్తింపు

44 సొసైటీలకు అనుమతి

సొమ్ముల చెల్లింపుపై సందిగ్ధత

భవన యజమానుల మండిపాటు

ఇసుక ఇవ్వాలని డిమాండ్‌

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

సో..శాడ్‌.. సమస్య చేతల్లోనే ఉంది.. అయినా పరిష్కారానికి మాత్రం ఎందుకో చేతలు రావడం లేదు.. ఒక పక్కన ప్రజలు ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారుల్లో మాత్రం ఎక్కడా చలనం లేదు. సర్కారు వరమిచ్చినా నేటికీ ర్యాంపులు తెరుచుకోక భవన నిర్మాణ యజమానులు ఇసుకకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.. ఇసుకకు ఎదురుచూపులు తప్పడంలేదు.. సర్కారు రైట్‌ రైట్‌ అంటున్నా.. అధికారులు రేపు మాపూ అంటూ వాయిదా వేస్తూనే ఉన్నారు. ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతూనే ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో జూలై 8 నుంచే ఉచిత ఇసు క విధానం అమల్లోకి తెచ్చింది. ఆ తరువాత నిల్వ ఉన్న ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. అయి తే ఇటీవల ఆన్‌లైన్‌ విధానం అమలుకు అనుమ తిచ్చింది. అయినా ఇంత వరకూ టన్ను ఇసుక ప్రజలకు సరఫరా చేయలేదు. అఖండగోదావరిలో డీసిల్టేషన్‌ పేరిట ఇసుక తీయడానికి 9 పాయిం ట్లను గుర్తించి.. ఇసుక తీసే బాధ్యతను ఇరిగేషన్‌ అధికారులకు అప్పగించారు. అయితే కొద్దిరోజుల పాటు వరద వల్ల ఇసుక తీయడానికి ఇబ్బందు లేర్పడ్డాయి. ప్రస్తుతం వరద తగ్గినా ఇసుక తీయ డం లేదు. డీసిల్టేషన్‌ ద్వారా ఇసుక తీయడానికి ప్రస్తుతం జిల్లా ఎంప్యానల్‌ కమిటీ 44 బోట్స్‌మన్‌ సొసైటీలను గుర్తించి వాటికి అనుమతిచ్చింది. అయితే ఇంత వరకూ వర్కు ఆర్డర్లు బోట్స్‌మన్‌ సొసైటీలకు అధికారికంగా అందలేదు.పైగా అను మతి పొందిన సొసైటీలు గోదావరి నుంచి ఇసుక తీసి గట్టుమీద గుట్ట పెట్ట డానికి డబ్బులెవ రిస్తారనే ఇరిగేషన్‌ అధికారులు స్పష్టం చేయడం లేదు. రెవెన్యూ, ఇతర అధికారులు చెప్పలేకపోతు న్నారు. దీంతో మొన్నటి వరకూ తమకు అవకాశం ఇవ్వాలని అందరిపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన బోట్స్‌ మన్‌ సొసైటీలు ఇవాళ అనుమతిచ్చిన తర్వాత డబ్బులెవరిస్తారనేది తేలక ఇసుక తవ్వడం ఆరం భించలేదు.పైగా అధికారులు వారిని పిలిచి ఆర్డర్లు చూపించలేదు.డబ్బు ఎలా అందుతుందనేది ఇం త వరకూ స్పష్టం చేయలేదు. అనుమతి పొందిన సొసైటీలతో మీటింగ్‌ పెట్టి విధివిధానాలు చెప్ప గ లిగితే ఇప్పటికే ఇసుకతీత మొదలయ్యేది. ఎందు కో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు.

డబ్బు ఎలా వస్తుందో..

బోట్స్‌మన్‌ సొసైటీల భయాలకు కారణాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జేపీ,ప్రతిమా సంస్థల ద్వారా ఇసుక తీసినందుకు సుమారు రూ.30 లక్షల వరకూ బోట్స్‌మన్‌ సొసైటీలకు డబ్బు రావాల్సి ఉంది.ఈ మేరకు మైన్స్‌ అధికారు లు బిల్లులు చేశారు. అయితే జేపీ, ప్రతిమా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లిం చకపోవడంతో వారిపై చర్య తీసుకునే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో బోట్స్‌మన్‌ సొసై టీల పాత బకాయిలు చెల్లించకుండా నిలు పుదల చేశారు.దీంతో ఇసుకతీతకు ముందుకు రావడం లేదు. బోట్స్‌మన్‌ సొసైటీలు నిర్వహించేది పెద్దలే అయినప్పటికీ.. పనిచేసేది మాత్రం సామా న్యులే. రోజువారీ కానీ.. వారానికి ఒకసారి కానీ డబ్బులు ఇవ్వవలసిందే.పైగా ఇసుక తీసినందుకు ప్రభు త్వం ఇచ్చే డబ్బు ఎలా చెల్లిస్తారనే విష యంలో స్పష్టత లేదు. అధికారులు స్పష్టత ఇస్తే ఇసుక తీత పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

9 పాయింట్లు..44 సొసైటీలు..

ప్రస్తుతం డీసిల్టేషన్‌ పాయింట్లలో ఇసుక తీయ డానికి గాయత్రి,కోటి లింగాల,కొవ్వూరు ప్రాంతాల్లో 9 పాయింట్లలో 44 బోట్స్‌మన్‌ సొసైటీలకు ఇప్ప టికే అధికారులు అనుమతిచ్చారు. కానీ పాయిం ట్లు తక్కువ.సొసైటీలు ఎక్కువ. తీసిన ఇసుక ఏ సొసైటీ ఎక్కడ పోగుపెట్టాలనే విషయంలోనూ స్పష్టత లేదు.అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు.సొసైటీలు మాత్రం ర్యాంపుల్లో బాటలు, బోట్లు సిద్ధం చేసుకున్నాయి. అధికారుల నుంచి స్పష్టత లేక ఇసుక తీత ఆరం భం కావడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

అధికారులదే ఆలస్యం..

వాస్తవానికి జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ ఎస్‌సీ) ఉంది.దీనికి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చైర్మన్‌గా ఉంటారు.డీఎల్‌ఎసీ చైర్మన్‌, మైన్స్‌ ఏడీకి జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఉం టుంది. ప్రస్తుతం ఇసుక తీత మొదలై సరఫరా జరిగితే ఇసుక తవ్వకం,లోడింగ్‌, ఇతర పరిపాలన పర మైన ఖర్చులకు వచ్చే డబ్బు వారి అకౌం ట్‌లో జమవుతుంది.అదే డబ్బును బోట్స్‌మన్‌ సొసైటీ లకు తిరిగిస్తారు. కానీ దీనిని ఏవిధంగా ఇస్తార నేది స్పష్టత లేక సమస్య జఠిలమై కూర్చుం ది. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. మొత్తం 9 డీసిల్టేషన్‌ పాయింట్లలో ఇసుక తీయడానికి ప్ర స్తుతం 44 సొసైటీలకు అనుమతిచ్చారు. అయితే వీటి సంఖ్య 74 పెరుగుతుందనే ప్రచా రం ఉం ది.వీటన్నింటికీ కలిసి ఒకే బ్యాంక్‌ ఖాతా తెరుస్తా రని, ఒకే ఒకరు ఈ వ్యవహా రాన్ని ఆఫ్‌ లైన్‌లో నడిపే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగు తుం డడంతో, స్పష్టత కోసం కూడా బోట్స్‌మన్‌ సొసై టీ నిర్వా హకులు ఎదురుచూస్తున్నారు . కానీ ఇసుక తీత ఆలస్యం కావ డంతో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నైనా అధికారులు స్పం దించి ఇసుక తీతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు న్నారు.

Updated Date - Oct 01 , 2024 | 12:39 AM