Share News

ఉచిత ఇసుక విధానం అమలుకు కృషి చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:39 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కృషిచేయాలని రామచంద్రపురం ఆర్డీవో ఎస్‌.సుధాసాగర్‌ అన్నారు.

ఉచిత ఇసుక విధానం అమలుకు కృషి చేయాలి

కపిలేశ్వరపురం, జూలై 7: ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కృషిచేయాలని రామచంద్రపురం ఆర్డీవో ఎస్‌.సుధాసాగర్‌ అన్నారు. ఆదివారం కపిలేశ్వరపురం, తాతపూడి వద్ద ఉన్న రెండు ఇసుక స్టాక్‌ పాయింట్లను ఆయన పరిశీలించారు. సోమవారం నుంచి ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కొత్త శాండ్‌పాలసీ మేరకు ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను అందిస్తామన్నారు. వాహనాలు వచ్చి వెళ్లేందుకు, బార్‌కేడింగ్‌ తదితర పనులు జరుగుతున్నాయన్నారు. స్థానికంగా లోడింగ్‌ చేయడం, ట్రాన్స్‌పోర్ట్‌ కోసం ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో శాండ్‌కమిటీ చార్జీలు నిర్ణయిస్తుందన్నారు. ఉద యం6 నుంచి సాయంత్రం 6వరకు ఇసుక సరఫరా చేస్తామ న్నారు. ఇసుక నిల్వ కేంద్రాలు సీసీకెమెరాల నిఘాలో ఉంటా యన్నారు. నిల్వ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌ రాజరాజేశ్వరి, ఆర్‌అండ్‌బీ డీఈసూర్యనారాయణ, ద్రాక్షారామ, మండపేట ఏఈలు కిషోర్‌కుమార్‌, ఫణిలింగేశ్వరరావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఎలక్ర్టికల్‌ ఏఈ సలీంరాజు, వీఆ ర్వోలు శ్రీనివాసరావు, జాన్‌, ప్రసాద్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:39 AM