Share News

సీనరేజి, జీఎస్‌టీ రద్దుపై ఉత్తర్వులు రావాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:43 AM

ప్రతి రోజు రీచ్‌ల నుంచి కనీసం వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకం చేసేలా బోట్స్‌మెన్‌ సొసైటీలకు లక్ష్యాలను నిర్ధేశించాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు.

సీనరేజి, జీఎస్‌టీ రద్దుపై ఉత్తర్వులు రావాలి
డ్రైవర్లతో మాట్లాడుతున్న తహశీల్దార్‌

రాజమహేంద్రవరం సిటీ/ కొవ్వూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రతి రోజు రీచ్‌ల నుంచి కనీసం వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకం చేసేలా బోట్స్‌మెన్‌ సొసైటీలకు లక్ష్యాలను నిర్ధేశించాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి గురువారం జిల్లాస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో 118 సొసైటీలకు అనుమతులివ్వడం జరిగిందన్నారు. 17 ఓపెన్‌ రీచ్‌లకు డీఎల్‌ఎస్సీ అనుమతులు జారీ చేశామని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఇసుక సీనరేజి, జీఎస్టీ రద్దుపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని జిల్లా గనులు, భూగర్భ శాఖాఽధికారి జి.ఫణీంద్రరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 డీసిల్టేషన్‌ ర్యాంపులు అనుమతించడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరంలో 3, కొవ్వూరు డివిజన్‌లో 6 ర్యాంపులు నడుస్తున్నాయన్నారు. రాజమహేంద్రవరంలో ఒక ర్యాంపును విశాఖపట్నం జిల్లా వినియోగదారులకు కేటాయించామన్నారు. ఇసుక రవాణా సమయంలో టోల్‌ చార్జీలు వినియోగదారులు చెల్లించాలన్నారు. జిల్లా టాస్క్‌పోర్సు టీము ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ర్యాంపుల్లో డబ్బులు డిమాండ్‌ చేస్తే చర్యలు

తనిఖీలో తహశీల్దార్‌ దుర్గాప్రసాద్‌

కొవ్వూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : కొవ్వూరు, ఔరంగాబాద్‌ ఇసుక ర్యాంపుల వద్ద మామూళ్లపై విచారణ చేపట్టాలని ఆర్డీవో రాణి సుస్మిత ఆదేశించారు. ఇసుక రవాణాపై ‘అయోమయం గందరగోళం’ అని ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందిం చారు. ఈ మేరకు గురువారం కొవ్వూరు తహశీల్దార్‌ ఎం.దుర్గాప్రసాద్‌ విచారణ చేపట్టారు. కొవ్వూరులోని ఇసుక ర్యాంపులను తనిఖీచేశారు. అధికంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే చర్యలు తప్పవని లారీ డ్రైవర్లను హెచ్చరించారు. కొవ్వూరు పరిధి లో ర్యాంపుల నుంచి ప్రతిరోజు సుమారు 300 లారీలు వెళుతున్నట్టు తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 12:43 AM