మిగిలిన ఇసుకెంత?
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:21 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయక్వతంలోని కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్న సంగతి తెలిసిందే.దీని కోసం జిల్లాలో ఏడు స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

స్టాక్ పాయింట్ల వద్ద రెవెన్యూ అధికారుల పంపిణీ
కుమారదేవం పాయింట్ నుంచి సరఫరా
రాజమహేంద్రవరం- (ఆంధ్రజ్యోతి)/కొవ్వూరు/పెరవలి, జూలై 7 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయక్వతంలోని కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్న సంగతి తెలిసిందే.దీని కోసం జిల్లాలో ఏడు స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేశారు.రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఇది అమలు కానుంది. ఒక్కో స్టాక్ పాయింట్ వద్ద ఒక ఆర్‌ఐ, ఐదు గురు వీఆర్వోలను నియమించారు. ఇసుక టన్నుకు సుమారు రూ.200 పైగా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకా ఖరారు కాలేదు. ర్యాంపుల నుంచి స్టాక్ పాయింట్ల వరకూ దూరాన్ని బట్టి, ఆయా స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ధర ఉంటుంది. జిల్లాలోని కాతేరు, లాలాచెరువు, బుర్రిలంక, కుమారదేవం-చిడిపి, పందలపర్రు, పెండ్యాల, ఉసులు మర్రులోని ఏడు స్టాక్ పాయింట్లలో 3 లక్షల టన్నుల ఇసుక ఉంది. దానినే ముందు విక్రయిస్తారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉండగా ర్యాంపుల్లో ఇసుక నిల్వలపై మైన్స్, రెవెన్యూ అధికారులు ఆదివారం ఆరా తీశారు. పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు, వాడపల్లి, ఔరంగాబాద్ ఇసుక ర్యాంపుల్లో ఇసుక నిల్వలను మైన్స్ ఏజీ విఘ్నేష్, కొవ్వూరు తహశీల్దార్ కె. మస్తాన్‌లు సిబ్బందితో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభిస్తున్నందున అధికారులు ర్యాంపుల్లో నిల్వ ఉన్న ఇసుక ఎంత మేర ఉందో పరిశీలించి నిల్వ ఉన్న ఇసుక గుట్టలను నమోదు చేసుకున్నారు.కొవ్వూరు మండలం కుమారదేవం స్టాక్ పాయింట్ నుంచి సోమవారం ఉచిత ఇసుక రవాణా ప్రారంభిస్తారన్నారు. తీపర్రు - ఉసులుమర్రు మధ్య గల ఇసుక గుట్టల నుంచి ఉచిత ఇసుక పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం అధికారులు అక్కడకు వచ్చి పరిశీలించారు.పడవ యజయానులకు గతంలో ప్రభుత్వం టన్నుకు రూ. 200లు ఇచ్చేదని.. ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పడవ యజమానులకు ఇచ్చే ధరను పెంపుదల చేయాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ర్యాంపుల్లో నిల్వ ఉన్న ఇసుకను ముందుగా విక్రయించాలని కోరగా స్టాక్ పాయింట్లు పూర్తయిన తరువాత పడవ ర్యాంపులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని సోమవారం ఉదయం కలెక్టర్ ఆదేశాలు మేరకు ఇసుక పంపిణీ చేస్తామని తెలిపారు.ర్యాంపులను మైన్స్ ఏజీ విఘ్నేష్, తహశీల్దార్ కె.మస్తాన్, డిప్యూటీ తహశీల్దార్లు అజయ్‌కుమార్, కనకదుర్గ, సర్వేయర్ గోపాలకృష్ణ, ఇసుక స్టాక్ పాయింట్ ఇన్‌చార్జి సన్నిబాబు, ఎస్‌ఐ మూర్తి, తీపర్రు ఉసులుమర్రు వీఆర్‌వోలు సుబ్బారావు,రవి పరిశీలించారు.