Share News

ఇసుక దొంగలను పడతారా!?

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:53 AM

సుప్రీంకోర్టును ఆదేశించినా.. కలెక్టర్‌ తనిఖీలు చేసినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదు.. ఒక పక్క పోలింగ్‌ జరు గుతున్నా...కౌంటింగ్‌ జరుగుతున్నా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిపో యాయి.. ఎటువంటి భయంలేకుండా తవ్వేశారు.

ఇసుక దొంగలను పడతారా!?
ఖాళీగా ఉన్న ఇసుక ర్యాంపు

ఎక్కడికక్కడ కొండలుగా స్టాక్‌ పాయింట్లు

ప్రభుత్వం మారడంతో ఆగిన ర్యాంపులు

నిన్నటి వరకూ కన్నెత్తి చూడని అధికారులు

నేడు ఏం చేస్తారో చూడాలి మరి

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

సుప్రీంకోర్టును ఆదేశించినా.. కలెక్టర్‌ తనిఖీలు చేసినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదు.. ఒక పక్క పోలింగ్‌ జరు గుతున్నా...కౌంటింగ్‌ జరుగుతున్నా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిపో యాయి.. ఎటువంటి భయంలేకుండా తవ్వేశారు. కడియం మండలం బుర్రి లంకలో గోదావరి గట్టుకు చేర్చి ఇసుక కొండలు ఉన్నాయని ఆంధ్రజ్యోతి చెప్పి నా పట్టించుకోలేదు.. ఎస్పీ కార్యాలయానికి అతి చేరువలో మరో ఇసుక కొండను పోగేసినా కన్నెత్తి చూడలేదు.. మాకేం భయం.. ఏమైనా ఉంటే అక్కడ తేల్చు కుంటాం అనేలా ఇసుకాసురులు రెచ్చిపోయారు.. ఉన్నతాధికారులు వంత పాడారు.. డ్రెడ్జింగ్‌ ముసుగులో సాగుతున్న అక్రమాలను ఆంధ్రజ్యోతి బయట పెట్టినా కనీసం కన్నెత్తి చూడలేదు. అయితే గురువారం చూస్తే అంతా సైలెం ట్‌.. గోదారంతా ప్రశాంతంగా.. ఖాళీగా కనిపించింది.. ఐదేళ్ల తరువాత గోదా రమ్మకు కాస్త ప్రశాంతత లభించింది. ఎందుకంటే ప్రభుత్వం మారడంతో ఇసుక ఆక్రమాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తెలుగుదేశం-జనసేన- బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడంతో ఇసుక దొంగలు పరారయ్యారు. ఇప్పటి వరకూ జిల్లాలోని ఇసుక పేరిట రూ. కోట్లు దోచుకున్న ఆర్‌కె అనే వ్యక్తి వదిలేసి వెళ్లిపోయాడు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాల పేర్లతో ఇసుక దోపిడీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోని కాంట్రాక్టు ముగిసిపోవడంతో గతేడాది మే నుంచి వైసీపీ నేతలు నేరుగా పాత కాంట్రాక్టు సంస్థ బిల్లులుతో దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. ముందుగానే వైసీపీ పెద్దలకు రూ.కోట్లు ముట్టచెప్పి తర్వాత సబ్‌-లీజుదారులు ఇసుక అక్రమాలు కొనసాగిం చారు. హైకోర్టు ఆదేశించినా, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించినా, చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహించినా కూడా ఇసుక అక్రమాలను అధికారులు అడ్డుకోలేకపోయారు. చివరకు తప్పుడు నివేదికలు కూడా ఇవ్వగలిగారు. వైసీపీ నేతలు అంతలా అధికార్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రతి సోమవారం నివేదిక ఇవ్వాలని జిల్లా కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించినా తూతూమంత్రంగా నివేదిక ఇచ్చారు.. ఇసుక అక్ర మాలు జరగడంలేదని సాక్షాత్తు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడం గమనార్హం. అధికా రికంగా డ్రెడ్జింగ్‌ జరుగుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెప్పిన సంగతి తెలి సిందే. ఇవాళ అది కూడా ఆగిపోయింది. కొన్ని ఓపెన్‌ ర్యాంపులు ఆపారు. అయితే అధికారులు అసలు పట్టించుకోవాల్సిన అక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఓపెన్‌ ర్యాంపుల్లో అక్రమంగా యంత్రాలతో తవ్వి అనేక చోట్ల ఇసుక స్టాక్‌పాయింట్లు పెట్టారు. గతంలో ఒక పద్ధతి ఉండేది. ప్రతి స్టాక్‌లో ఎంత ఇసుక ఉండేదనే లెక్క ఉండేది. ఇవాళ లెక్కాపత్రం లేదు. ఎప్పుడూ తాము ఈ ర్యాంపులకు అనుమతులు ఇవ్వలేదని, తమ వద్ద అటువంటి పత్రాలు కూడా ఏమీ లేవని మైన్స్‌ అధికారుల కథనం.కానీ ఈ స్టాక్‌ పాయింట్ల జోలికి పోరు. కనీసం తనిఖీ చేసి ఇది ఎవరిదో తేల్చవలసిన బాధ్యత, మైన్స్‌, ఇరిగేషన్‌, సెబ్‌, రెవెన్యూ,భూగర్భజలం, పోలీస్‌ వంటి అధికారులకు ఉంది. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇరిగేషన్‌ అధికారులు మరీ దారుణం.అసలు కన్నెత్తి చూడడమే మానేశారు. గత ఐదేళ్లుగా మామూళ్ల మత్తులో జోగుతూ తిమింగళాల మాదిరిగా తయారయ్యారు. ప్రభుత్వం మారినా నేటికీ ఆ తీరు మార్చుకోలేదు.. అయితే ఇప్పటి వరకూ అబద్దాలు ఆడిన అధికారులు కంగారు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇవన్నీ ఆరా తీస్తే లెక్కలు ఎలా చెప్పాలని భయపడుతున్నారు. ఒక్క రికార్డులేదు. అధికారికంగా అనుమతులు లేవు. జిల్లా లో వేల కోట్ల ఇసుక ఆదాయం పక్కదారి పట్టేసింది.

ఇసుక కొండలు స్వాధీనం చేసుకుంటారా?

రాజమండ్రి, కొవ్వూరు డివిజన్లలో చాలా ఇసుక కొండలు ఉన్నాయి. సాక్షాత్తు ఎస్పీ కార్యాలయం పక్కనే ఒక ఇసుక కొండ ఉంది.. బుర్రిలంక ర్యాంపు వద్ద మరో ఇసుక కొండ ఉన్నట్టు సమాచారం.ఇలా ఎక్కడపడితే అక్కడ ఇసుక కొండలు పెట్టేశారు. ఆ ఇసుక ఎవరు తవ్వారో, వారికి ఎవరు అనుమతిచ్చారో, యంత్రాలతో ఎందుకు తవ్వారో, ఈస్టాక్‌లలో ఎంత ఇసుక ఉందో అధికారుల వద్ద లెక్కలు,ఆధారాలు లేవు. వాటిని అధికారులు ఎలా స్వాధీనం చేసుకుం టారో చూడాలి.నిన్నటి వరకూ వారి చుట్టూనే తిరిగిన అధికారులు ఇప్పుడేం చేస్తారో చూడాలి.ఙఇక ర్యాంపుల్లో ఉన్న యంత్రాల సంగతి తేల్చాల్సి ఉంది. గత ఐదేళ్లగా నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతోనే ఎగుమతి దిగు మ తులు చేస్తున్నారు.అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడైనా ర్యాంపుల్లో వదిలేసిన యంత్రాలపై అధికా రులు దృష్టి సారించాల్సి ఉంది. అంతే కాకుం డా ఇష్టానుసారంగా తవ్వేసిన ఏటిగట్లను మూయించాల్సి ఉంది.

Updated Date - Jun 07 , 2024 | 12:53 AM