Share News

కొత్త పేరుతో.. పాత దొంగలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:59 AM

ఇసుక వ్యాపారానికి కొత్త కాంట్రాక్టు సంస్థ వచ్చింది. కానీ అధికారులు ఇంకా ర్యాంపులు అప్పగించకుండా కొత్తపేరుతో పాత దొంగలు ఇసుక దోపిడీ చేసేస్తున్నారు.

కొత్త పేరుతో.. పాత దొంగలు

ప్రతిమా కనస్ట్రక్షన్‌తో ఒప్పందం

ర్యాంపులు ఖరారు కాకుండానే తవ్వకం

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

ఇసుక వ్యాపారానికి కొత్త కాంట్రాక్టు సంస్థ వచ్చింది. కానీ అధికారులు ఇంకా ర్యాంపులు అప్పగించకుండా కొత్తపేరుతో పాత దొంగలు ఇసుక దోపిడీ చేసేస్తున్నారు. జేపీ సంస్థకు గత మే నెలలో కాంట్రాక్టు సంస్థ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అనా మకుల పేర్లతో ర్యాంపులు నడచిపోతు న్నాయి. కానీ పాత బిల్లులే ఇచ్చారు. దీనిపై ఎంత మంది గోడుపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త కాంట్రాక్టు సంస్థను తెరమీదకు తెచ్చింది. ప్రతిమా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేర ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, కాకి నాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఇసుక వ్యాపారమంతా ఈ సంస్థకే అప్పగించారు.కానీ జిల్లాలో ఇంకా ఈ సంస్థకు గోదావరి ఇసుక ర్యాంపులు అప్పగించలేదు. సీతానగరం మండలం ముని కూడలి తదితర ప్రాంతాల్లో ప్రతిమా కన్‌స్ట్రక్షన్‌ పేర ఉన్న బిల్లుతో ఇప్పటికే తవ్వేస్తున్నారు. అధికారులేమో అసలు ఆ ర్యాం పులకు అనుమతులు లేవని చెబుతున్నారు. అఖండగోదావరిలో డీ సిల్టేషన్‌కు గత నెల 27తో గడువు ముగిసింది. తిరిగి ఇంకా అనుమతివ్వలేదు. కానీ గాయత్రి, కాతేరు, వెంకటనగర్‌ ర్యాం పుల్లో రాత్రీపగలూ డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. పబ్లిక్‌గా ఇసుక అమ్మేస్తున్నారు.రూ.కోట్లు దోపిడీ చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి మా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇసుక వ్యాపారానికి వచ్చిందని అధికా రులు చెబుతున్నారు.వారికి 25 ర్యాంపుల వరకూ అప్పగించ డానికి జిల్లా స్థాయి ఇసుక కమిటీలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఇంకా ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇరిగేషన్‌ అధికారుల వద్ద జాబితా పెండింగ్‌లో ఉంది.డీ సిల్టేషన్‌కు కూడా అనుమతి లేదు.ఈ పరిస్థితుల్లో ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

సీజ్‌ చేసిన ఇసుకా బేరమే..

గతంలో కోటిలింగాల రేవు ప్రాంతాల్లో అక్రమంగా తవ్వుకున్న ఇసుకను కాతేరు ప్రాంతంలో ఓ విద్యాసంస్థ సమీపంలో స్టాక్‌ పెట్టారు. దానిపై ఫిర్యాదులు రావడంతో సీజ్‌ చేశారు. అప్పట్లో ఫైన్‌ కూడా వేసినట్టు ప్రచారం జరిగింది.కొందరు నేతల ఒత్తిడి వల్ల ఈఫైన్‌ రద్దు చేయించు కోవడానికి వేరే బిల్లులు సమర్పిం చినట్టు సమాచారం.అధికారులు ప్రస్తుతం ఈ బిల్లులు పరిశీలి స్తున్నామని చెప్పారు.

Updated Date - Jan 03 , 2024 | 12:59 AM