Share News

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:09 AM

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

అమలాపురం టౌన్‌, జనవరి 5: సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు కాంట్రాక్టు కార్మికులను రెగ్యు లర్‌ చేస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తూ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం పదో రోజుకు చేరుకుంది. అమలాపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం నిర్వహించారు. ప్రభుత్వానికి కనువిప్పుకలిగించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలి పారు. పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నా ప్రభుత్వం కనికరించక పోవడం శోచనీయమని జేఏసీ నాయకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, తొమ్మండ్రు గోపి పేర్కొన్నారు. దీక్షలో నాయ కులు కొప్పుల బాబి, బండారు బాలకృష్ణ, చిన్ని, కానేటి వెంక ట్రావు, రాయుడు సుబ్బలక్ష్మి, ఎం.మంగాయమ్మ, జయరా మా యమ్మ, ఎం.రమణ, పి.సాయమ్మ, సీఐటీయూ నాయ కులు పి.కోటేష్‌, ఎన్‌.మూర్తి, ఎం.రాంబాబు, ఎ.ప్రసాద్‌, జి.వర లక్ష్మి, బి.తలుపులమ్మ, అనంతలక్ష్మి, నీలావతి, సుశీల పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 01:09 AM