విధుల పట్ల నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదు : కమిషనర్
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:35 AM
సామర్లకోట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వార్డు సచివాలయాల్లో సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదని, సమయపాలన పాటించి అవుడ్‌డోర్ వెళ్లేటప్పుడు మూమెంట్ రిజిష్టర్‌లో నమోదులు చేయాలని సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఆదేశించారు. మంగళవారం సామర్లకోటలోని అయోధ్యరామ పురం
సామర్లకోట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వార్డు సచివాలయాల్లో సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదని, సమయపాలన పాటించి అవుడ్‌డోర్ వెళ్లేటప్పుడు మూమెంట్ రిజిష్టర్‌లో నమోదులు చేయాలని సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఆదేశించారు. మంగళవారం సామర్లకోటలోని అయోధ్యరామ పురం 13వ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ వెళ్లిన సమయంలో కేవలం ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నా రు. మిగిలిన సిబ్బంది అందరూ అవుట్‌డోర్ వ ర్క్‌కు వెళ్లారని చెప్పడంతో ఆమె స్వయంగా వారికి ఫోన్ చేసి తక్షణం తన ఎదుట హాజరు కావాలని ఆదేశించడంతో ఒక్కొక్కరూ సచివాల యానికి వచ్చారు. అయితే సచివాలయంలో సి బ్బంది రాకపోకలకు చెంది ఎటువంటి మూమె ంట్ రిజిష్టర్ నిర్వహించడం లేనట్లు కమిషనర్ గుర్తించారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల ఎప్పటి కప్పుడు అమలు చేయడంలో కూడా సిబ్బంది ని ర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె గుర్తించారు. వీఆర్వో సచివాలయంలో అందుబాటులో లేని కారణంగా, హాజరు పట్టికలో నిర్దేశించిన రీతిలో సంతకాలు చేయడం లేనట్లు గుర్తించి సదరు వీఆర్వోకు మెమో జారీ చేయాలని ఆమె ఆదేశించారు. పన్నుల వసూళ్లు ప్రగతి తీరు నిరా శాజనకంగా ఉందన్నారు. పన్నుల బకాయి లు ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయడమే గాక తరచూ వారికి ఫోన్లు చేసి పన్నులు సత్వరం వసూలయ్యేలా కృషిచేయాల న్నారు. సిబ్బంది పనితీరు మరింత మెరుగు పర్చు కోకపోతే మరోసారి తనికీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.