Share News

సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:17 AM

కాకినాడ సిటీ, జనవరి 5: విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కేంద్ర కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సిం గ్‌ ఉద్యోగులను అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడ లోని ధర్నాచౌక్‌ వద్ద శుక్రవారం సమ్మె శిబిరంలో ఒంటి కా లిపై నిల్చొని నిరసన

సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన

కాకినాడ సిటీ, జనవరి 5: విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కేంద్ర కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సిం గ్‌ ఉద్యోగులను అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడ లోని ధర్నాచౌక్‌ వద్ద శుక్రవారం సమ్మె శిబిరంలో ఒంటి కా లిపై నిల్చొని నిరసన తెలిపారు. శాంతియుతంగా తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన ఉద్యోగులను అరెస్టులు చేయడం తగదని సీఐటీయూ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దు వ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ఉద్యోగుల న్యాయ, చట్టబద్ధమైన డిమాండ్లు పరిష్కరించి 17రోజులుగా జరుగుతున్న సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ అనుబంధ సంఘాలన్నీ ఉద్యోగులకు మద్దతుగా పోరాటంలోకి దిగుతాయని వారు హెచ్చరించారు.

Updated Date - Jan 06 , 2024 | 12:17 AM