Share News

జీతం అడిగితే.. ఉపాధి గాలిలో..

ABN , Publish Date - May 03 , 2024 | 01:11 AM

రైల్వే మహిళా పారిశుధ్య కార్మికుల ఉపాధిని అధికారులు గాలిలో పెట్టా రు. 5 నెలల నుంచీ జీతాలు లేకపోవడంతో బుధవారం (మే1న) వారు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరి ంచిన విషయం విధితమే. అప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందనలేదు. దీంతో ఉపాధి పోతుందన్న భయంతో గురువారం ఉదయం 5గంటలకే హెచ్‌ఐ కార్యాలయం వ ద్దకు చేరుకున్నారు.

జీతం అడిగితే.. ఉపాధి గాలిలో..

అడకత్తెరలో రైల్వే మహిళా కార్మికులు

ఒప్పందమే లేకుండా 3 నెలలు శ్రమ దోపిడీ

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన యంత్రాంగం

రాజమహేంద్రవరం, మే2(ఆంధ్రజ్యోతి): రైల్వే మహిళా పారిశుధ్య కార్మికుల ఉపాధిని అధికారులు గాలిలో పెట్టా రు. 5 నెలల నుంచీ జీతాలు లేకపోవడంతో బుధవారం (మే1న) వారు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరి ంచిన విషయం విధితమే. అప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందనలేదు. దీంతో ఉపాధి పోతుందన్న భయంతో గురువారం ఉదయం 5గంటలకే హెచ్‌ఐ కార్యాలయం వ ద్దకు చేరుకున్నారు. విధులు కేటాయించేదిలేదని ఆయన చెప్పడంతో గంటలపాటు అక్కడే కార్మికులు పడిగాపులు పడ్డారు. అయినా కనికరం లేకపోవడంతో వెనుదిరిగారు. వీరికి ఇద్దరు కాంట్రాక్టర్లు కలిపి ఐదునెలల జీతం బకాయి ఉన్నారు. కార్మికుల జీతాలకు సంబంధించి ఇక్కడి హెచ్‌ఐ కార్యాలయం నుంచే విజయవాడ సీనియర్‌ డీఈఎన్‌హెచ్‌ ఎంకి బిల్లులు వెళతాయి. పాత కాంట్రాక్టరు రెండు నెలల జీతం ఇవ్వాలి. తర్వాత వచ్చిన కొత్త కాంట్రాక్టరు వీరితో మూడు నెలలపాటు పని చేయించుకున్నారు. ఆ కాంట్రా క్టరు అసలు రైల్వేతో ఒప్పందమే చేసుకోకుండా వీరిని వినియోగించుకున్నారు. రైల్వే ఆయనకు ఎల్‌వోఏ మాత్ర మే ఇచ్చింది. ఒప్పందం కాకుండానే ఈ కార్మికులతో పని చేయించేసుకున్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టరు నుంచి కార్మి కులకు రావాల్సిన బకాయిలపై స్థానిక అధికారులు కూడా చేతులెత్తేశారు. కాంట్రాక్టర్‌ ఎక్కడ ఉన్నాడో తమకు సరైన సమాచారం లేదన్నారు. ఆ కాంట్రాక్టరుకు సంబంధించిన సూపర్‌వైజర్లు, షిఫ్ట్‌ ఇన్‌చార్జిలు కూడా ఇక్కడి నుంచి జారుకున్నారు. సెంట్రల్‌ లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ప్రధాన్‌కి కార్మికులు ఫిర్యాదు అందజేయగా.. ఈనెల 15న రావాలని చెప్పారు. అప్పటివరకూ తమ జీతం, విధుల సంగతి ఏమిటని కార్మికులు అభ్యర్థించగా ఆ అధికారి నుంచి సమాధానం కరువైంది. తమ ఉన్నతాధికారి అ యిన సీనియర్‌ డీఈఎన్‌హెచ్‌ఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లామని ఈ కార్మికుల కంట్రోలింగ్‌ అధికారి అయిన రైల్వే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరాములు చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి పాత కాంట్రాక్టరు ఇవ్వాల్సిన రెండు నెలల వేతనం వచ్చే అవకాశం ఉందన్నారు. కొత్త కాంట్రాక్టరు బకాయి ఉన్న 3 నెలల జీతంపై మాత్రం తాను భరోసా ఇవ్వలేనని చేతులెత్తేశారు. మరి ఇన్ని నెలలూ పని చెలా చేయించుకున్నారనే ప్రశ్నకు సమాధానంలేదు. కాగా పాత కాంట్రాక్టరు ఇవ్వాల్సిన జీతాల బిల్లు విజయవాడలోని సీనియర్‌ డీఈఎన్‌హెచ్‌ఎం వద్ద 4 నెలల నుంచీ పెండి ంగ్‌లో ఉండగా.. కొత్త కాంట్రాక్టరుకు సంబంధించి ఇంకా ఇక్కడి నుంచి బిల్లు వెళ్లలేదు.

ఫ ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక

38 మంది రైల్వే మహిళా పారిశుధ్య కార్మికుల ఇక్కట్లపై ‘రైల్వే మహిళా కార్మికుల కన్నీరు’ శీర్షికన బుధవారం ప్రచురితమైన వార్తకు అధికారుల్లో కదలిక వచ్చింది. సెంట్రల్‌ లేబర్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారి ప్రధాన్‌ హెచ్‌ఐ శ్రీరాములుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆర్‌పీఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ కూడా ఈ విషయంపై ఆరా తీసింది. విజయవాడలోని డీఆర్‌ఎం కార్యాలయం సైతం స్పందించిందని సమాచారం.

Updated Date - May 03 , 2024 | 01:11 AM