సాహితీ సభలకు వేదిక కల్పించండి
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:40 AM
కళాగౌతమి ఆధ్వర్వంలో నిర్వ హించే నెలవారీ సాహిత్య కార్యక్రమాలకు తగిన ప్రదేశం ఏర్పాటు చేయడా నికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు కళాగౌతమి సభ్యుల వినతి
రాజమహేంద్రవరం కల్చరల్, జూలై 14: కళాగౌతమి ఆధ్వర్వంలో నిర్వ హించే నెలవారీ సాహిత్య కార్యక్రమాలకు తగిన ప్రదేశం ఏర్పాటు చేయడా నికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన కళాగౌతమి నెలవారీ సమావేశంలో వ్యవస్థాప కుడు బీవీఎస్ మూర్తి మాట్లాడుతూ 1992లో సినీనటి భానుమతి చేతుల మీదుగా కళాగౌతమి ఆవిష్కరణ జరిగిందని, అప్పటి నుంచి పలుచోట్ల నెల వారీ సమావేశాలు జరుపుకుంటున్నామని, అయితే శాశ్వత నివాసం కోసం ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సాకారం కాలేదన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హయాంలో నీడ కల్పించాలని ఆయన కోరారు. దీనిపై ఆదిరెడ్డి వాసు స్పందిస్తూ విక్రమహాలు బాగుచేయించడం ద్వారా పలు సంస్థల కార్యకలా పాలు నిర్వహించు కొనే వెసులుబాటు చర్యలు తీసుకొంటామన్నారు. కళా గౌతమికి గౌరవాధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే ఉండడం ఆనవాయితీయని, ఇకపై ఎమ్మెల్యే వాసు గౌరవాధ్యక్షుడిగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పీవీబీ సంజీవ రావు, బీహెచ్ రమాదేవి, శ్రీహరి జగన్నాథం, పి.విశాలాక్షి, పి.నరసింహమూర్తి, డి.నీలకంఠరావు, ఎం.మాలతి, శ్రీపాద సీతామహలక్ష్మి పాల్గొన్నారు.
సావిత్రి క్లాసిక్ పుస్తకావిష్కరణ
ఇటీవల హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని రాజమహేంద్రవరంలోనూ ఆవిష్కరించాలన్న నేపథ్యంలో స్థానిక వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో శనివారం రాత్రి జరిగిన కార్య క్రమంలో సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరిం చారు. నటగాయకుడు జిత్ మోహన్‌మిత్ర బృందం, నవరస నట సమాఖ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్యే వాసుతోపాటు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకు మార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు విచ్చేశారు. తనకంటూ ఒక ఒరవడి తెచ్చుకొన్న మహానటి సావిత్రిపై పుస్తకం రాయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రచయిత సంజయ్‌కిషోర్‌ను అభినందించారు. కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, పీవీఎస్ కృష్ణారావు, సూరపురెడ్డి తాతారావు, నూజిళ్ల సూరిబాబు, గిరిజాల సోమరాజునాయుడు, నిమ్తలపూడి గోవిందు, వి.జగపతి, అడబాల మరిడయ్య, గుంటూరు శ్రీనివాస్, బి.సీతారామారావు పాల్గొన్నారు.