Share News

వారమంతా సదరం క్యాంపులు

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:58 AM

జిల్లా వ్యాప్తంగా సదరం క్యాంపులను నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ పి.ప్రశాంతి వెల్లడించారు.

వారమంతా సదరం క్యాంపులు

జీజీహెచ్‌లో వారానికి రెండు రోజులు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 1 : జిల్లా వ్యాప్తంగా సదరం క్యాంపులను నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ పి.ప్రశాంతి వెల్లడించారు.ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సదరం సర్టిఫికెట్‌ కావాల్సిన వారు ముందుగా తమ పేర్లను గ్రామ సచివాలయాల్లో స్లాట్‌ కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ కేటాయించిన తర్వాత వారికి కేటాయించిన తేదీల్లో వైద్య పరీక్షలకు హాజరుకావాల్సిందిగా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందన్నారు. సీహెచ్‌సీల్లో ప్రతి సోమవారం కొవ్వూరు, గోపాలపురం, మంగళవారం గోకవరం, కడియం, బుధవారం నిడదవోలు, రాజానగరం, గురువారం అనపర్తి సీహెచ్‌సీల్లో ఆర్థోపెడిక్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం ఐదు విభాగాలకు సంబంధించిన సదరం క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - Aug 02 , 2024 | 12:58 AM