Share News

పండక్కి.. ఫుల్‌గా

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:06 AM

ఆర్టీసీ బస్సు ఫుల్‌ అయింది. పెద్ద పండగ సంక్రాంతి సందర్భంగా రిజర్వేషన్‌ టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు మొత్తం 88 స్పెషల్‌ బస్సులు వేసినా వాటిలోనూ టిక్కెట్లు అయిపోయాయి

పండక్కి.. ఫుల్‌గా
రాజమహేంద్రవరం బస్టాండ్‌

డౌన్‌లో 88 స్పెషల్‌ బస్సులు

సాధారణ చార్జీలే అమలు

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) :


.దీంతో మరిన్ని స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది. షెడ్యూలు సర్వీసులు, స్పెషల్‌ బస్సులన్నీ నిండిపోవడంతో జనవరి 9, 10, 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చే సర్వీసులకు రిజర్వేషన్‌ కౌంటర్‌ క్లోజ్‌ చేసేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద పండక్కి మూడు వారాల ముందే టిక్కెట్లన్నీ బుక్‌ కావడం ఆర్టీసీ అధికారులు,ఉద్యోగుల్లో ఆశ్చర్యం కల్గిస్తోంది.షెడ్యూలు బస్సులతో పాటు స్పెషల్‌ బస్సుల్లోనూ టిక్కెటు రేట్లు పెంచలేదు.సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు.

జిల్లా నుంచి 88 స్పెషల్స్‌ ..

పెద్ద పండక్కి జిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్లే వారికంటే అక్కడి నుంచి వచ్చే వారే ఎక్కువ. ఈ మేరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది.జనవరి 9, 10, 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. ఈ బస్సులన్నీ ముందు రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లి ఆయా రోజుల్లో ప్రయాణీకులతో తిరిగి చేరుకుంటాయి. జిల్లాలోని రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, గోకవరం డిపోల నుంచి సూపర్‌ లగ్జరీ, ఆల్ర్టా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు. ఇవన్నీ పెద్దపండక్కి హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణీకుల కోసం (డౌన్‌లో) ఏర్పాటు చేశారు. 9వ తేదీన గోకవరం డిపో నుంచి ఒక ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు, 10న ఐదు, 11న నాలుగు, 12న ఐదు, 13న ఒకటి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను నడుపుతున్నారు. కొవ్వూరు డిపో నుంచి 9వ తేదీన మూడు సూపర్‌ లగ్జరీ, 10న మూడు సూపర్‌ లగ్జరీ, ఒక ఎక్స్‌ప్రెస్‌, 11న మూడు సూపర్‌ లగ్జరీ, ఒక ఎక్స్‌ప్రెస్‌, 12న మూడు సూపర్‌ లగ్జరీ, ఒక ఎక్స్‌ప్రెస్‌, 13న ఒక సూపర్‌ లగ్జరీ సర్వీసు నడుపుతున్నారు. నిడదవోలు డిపో నుంచి 9వ తేదీన రెండు సూపర్‌ లగ్జరీ, 10న రెండు సూపర్‌ లగ్జరీ, 11న రెండు సూపర్‌ లగ్జరీ, 12న రెండు సూపర్‌ లగ్జరీ, 13న ఒక ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు నడుపుతున్నారు. ఇక రాజమహేంద్రవరం డిపో నుంచి 9వ తేదీన నాలుగు సూపర్‌ లగ్జరీ, రెండు ఆల్ర్టా డీలక్స్‌, 10న ఏడు సూపర్‌ లగ్జరీ, నాలుగు ఆలా్ట్ర డీలక్స్‌, మూడు ఎక్స్‌ప్రెస్‌, 11న ఆరు సూపర్‌ లగ్జరీ, నాలుగు ఆల్ర్టా డీలక్స్‌, రెండు ఎక్స్‌ప్రెస్‌, 12న ఏడు సూపర్‌ లగ్జరీ, నాలుగు ఆల్ర్టా డీలక్స్‌, మూడు ఎక్ప్‌ప్రెస్‌, 13న ఒక సూపర్‌ లగ్జరీ సర్వీసు నడుపుతున్నారు. ఇలా గోకవరం డిపో నుంచి 16 సర్వీసులు, కొవ్వూరు డిపో నుంచి 16 సర్వీసులు, నిడదవోలు డిపో నుంచి 9 సర్వీసులు, రాజమహేంద్రవరం డిపో నుంచి 47 సర్వీసులు స్పెషల్స్‌ నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ, విశాఖపట్నంతో పాటు కాకినాడ వంటి ప్రాంతాలకు స్పెషల్‌ సర్వీసులు నడపాలని భావిస్తున్నా ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం లేదు.

Updated Date - Dec 28 , 2024 | 01:06 AM