Share News

తూర్పు అంతా ఉచితమే!?

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:24 AM

ఆర్టీసీ బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణం.. సూపర్‌ సిక్స్‌లో కూటమి ప్రభుత్వ హామీ.. ఈ హామీ ఎప్పుడు అమలవు తుంది..ఎలా అమలవుతుందోనని మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తూర్పు అంతా ఉచితమే!?
ఏపీఎస్‌ ఆర్టీసీ బస్‌లు

త్వరలోనే ఆరంభానికి సన్నాహాలు

ఉమ్మడి జిల్లాలో 1200 బస్‌లు

ఉచితానికి సరిపోవని అంచనా

కొత్త బస్‌లు కొనాల్సిందే

ఇతర రాష్ర్టాల్లో పరిశీలన

ఆర్టీసీ సంఘాల ఆనందం

సామర్లకోట,జూన్‌ 16 : ఆర్టీసీ బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణం.. సూపర్‌ సిక్స్‌లో కూటమి ప్రభుత్వ హామీ.. ఈ హామీ ఎప్పుడు అమలవు తుంది..ఎలా అమలవుతుందోనని మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.పథకం సాధ్యాసాధ్యాలపై అధికా రులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై దృష్టి సారిస్తు న్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్ని బస్సులు ఉన్నాయి.. కొత్తగా ఎన్ని బస్సులు అవసరం ఉంటుందనే దానిపై లెక్కలు కడుతున్నారు. త్వరలోనే ఈ పథ కం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లాలో 1200 బస్‌లు..

ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1200 ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇక ప్రైవేట్‌ అద్దె బస్సులు 150 వరకూ ఉన్నాయి. అదే రాష్ట్రస్థాయిలో 11 వేలకు మించి బస్సులు లేవు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వల్ల అవసరాల రీత్యా కొత్త బస్సులు కొనుగోలు చేయా ల్సిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులు ప్రజల ప్రయాణవసరాలకు ఎంత మాత్రం సరిపో వడం లేదు.చాలా వరకూ కాలం తీరిన బస్సులతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. గత ఐదేళ్లలో కొత్త బస్సుల ఊసు లేకపోవడంతో కాలం తీరిన డొక్కు బస్సులనే ప్రయాణికులు ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రా రంభిస్తే బస్సులు ఎక్కే వారి సంఖ్య అనూ హ్యంగా పెరుగుతుంది. మహిళల ఆదరణ కార ణంగా ఉన్న బస్సులు సరిపోయే పరిస్థితి ఉం డదు. దీంతో కచ్చితంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ పథకాన్ని ప్రారంభించా లంటే కొత్త బస్సుల కొనుగోలు అనివార్యంగా కనిపిస్తోంది. కొనుగోలు చేయకపోతే బస్సులు సరిపోయే పరిస్థితి లేదు. సంస్థకు దశల వారీగా 30 వేల బస్సుల అవసరం ఉందని అప్పుడే అ పథకాన్ని అమలు చేయడం సాధ్యమవుతుందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకుడు అరిగెల నరసింహారావు అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం కొత్తగా బస్సులు కొనుగోలు చేయడంతో బాటు అదనపు సిబ్బందిని రిక్రూట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందని మరింత మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.

ఎక్కడెక్కడ అమలెలా..

ఇతర రాష్ట్రాల్లో మహిళల ఉచిత రవాణా పథ కాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వాలు ఖర్చును ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాయి.మన దగ్గర కూడా రాయితీకి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్ర భు త్వం ఆర్టీసీకి చెల్లించాలని ఉద్యోగ సంఘ నేతలు కోరుతున్నారు.దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ, పంజాబ్‌, చెన్నై,బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల తో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉచిత బస్‌ ప్రయాణ సౌకర్యం అమలవుతుంది.తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రభు త్వాల నుంచి ఏటా ఆర్టీసీకి రూ.4 వేల కోట్ల చొప్పు న ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ చెబుతోంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమపై ఒత్తిడి పెరిగే అవ కాశం ఉంటుందని ఉద్యోగులు అంటున్నారు.

ప్రైవేటీకరణకు అడ్డుకట్ట..

ఉద్యోగ సంఘాలను భయపెడుతున్న విద్యుత్‌ బస్సుల స్థానంలో డీజిల్‌ బస్సులు వస్తాయన్నది ఆర్టీసీ ఉద్యోగసంఘ నేతల ఆలోచనగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సుల విషయమై ఒక పాలసీ తీసుకొచ్చింది. విద్యుత్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటే సంస్థ పూర్తిగా ప్రైవేటీకరణ బాట పట్టే అవకాశం ఉంటుందన్నది ఉద్యోగసంఘాల మాట. మహిళలకు ఉచిత బస్సు వంటి పథకం అమలు చేస్తే విద్యుత్‌ బస్సుల వంటి భారమైన ప్రాజెక్ట్‌ల జోలికి ప్రభుత్వం వెళ్లద న్నది ఉద్యోగ సంఘాల అంతరంగా తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల నుంచి కూడా ఈ పథకం పట్ల సానుకూల స్పం దన వ్యక్తమవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీ విస్తరణకు తోడ్పడు తుందని ఆర్టీసీ ఉద్యోగ సం ఘాలు భావి స్తున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ సంరక్షణకు లోతైన అధ్యయనం చేసే స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌) మహిళల ఉచిత ప్రయాణ పథ కాన్ని గట్టిగా బలపరుస్తుంది. ఆర్టీసీ విస్తరణకు నోచుకోక దాని మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న తరు ణంలో ఈ పథకం ద్వారా విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయన్నది ఉద్యోగ సంఘాల అభిప్రాయం.

Updated Date - Jun 17 , 2024 | 12:24 AM