Share News

రౌండ్‌ రౌండ్‌కీ..

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:54 AM

ఇప్పటి వరకూ ఒక టెన్షన్‌. మంగళవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత మరో టెన్షన్‌. ఏ రౌండ్‌లో ఎవరికి మెజార్టీ వస్తుందనే టెన్షన్‌ ఉంటుంది. కానీ ఆయా నియోజ కవర్గాల్లో పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు మాత్రం ఏ రౌండ్‌లో ఏ మేరకు ఓట్లు వస్తాయో ఓ మాదిరిగా అంచనా వేసేయగలుగుతారు.

రౌండ్‌ రౌండ్‌కీ..
ఓట్ల లెక్కింపునకు నన్నయ యూనివర్శిటీలో ఏర్పాట్లు

  • ఏ నియోజకవర్గం ఎక్కడి నుంచి అంటే..

రాజమహేంద్రవరం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ ఒక టెన్షన్‌. మంగళవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత మరో టెన్షన్‌. ఏ రౌండ్‌లో ఎవరికి మెజార్టీ వస్తుందనే టెన్షన్‌ ఉంటుంది. కానీ ఆయా నియోజ కవర్గాల్లో పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు మాత్రం ఏ రౌండ్‌లో ఏ మేరకు ఓట్లు వస్తాయో ఓ మాదిరిగా అంచనా వేసేయగలుగుతారు. ఎందుకంటే పోలింగ్‌ స్టేషన్ల వారీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు ఒక్కో నియో జకవర్గానికి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు 14టేబుళ్ల వంతున ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు వేరే టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ రౌండ్‌లోనూ 14 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. తర్వాత మరో 14పోలింగ్‌బూత్‌ల ఓట్లు లెక్కిస్తారు. ఇలా మొత్తం లెక్కింపు పూర్తయ్యేవరకూ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి మొదటి రౌండ్‌లో 1నుంచి 14వ పోలింగ్‌బూత్‌ వరకూ నమోదైన ఈవీ ఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. దీనిని బట్టి ఆయా ప్రాంతాల్లో అవగాహన ఉన్నవారికి ఓ అంచనా అందేస్తుంది. ఓ రౌండ్‌లో ఓ అభ్యర్థి మెజార్టీ వస్తే, వచ్చే రౌండ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో కూడా చెప్పేసే లెక్కలు చాలా మంది వద్ద ఉంటాయి. కౌంటింగ్‌ ఏ పోలింగ్‌ స్టేషన్‌ నుంచి మొదలవుతుంది. ఏ రౌండ్‌లో ఏయే గ్రామాలు, ఏయే ప్రాంతాలు కవరవుతాయనే సమాచారం ముందుగానే వారి దగ్గర పెట్టుకుంటారు. ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యా యో కూడా వివరాలు సేకరించుకుంటారు. దీంతో ప్రతీ రౌండ్‌కు అంచనా ఉంటుంది. కానీ ప్రజలందరూ ఓట్లు ఎలా వేస్తారనేది చెప్పలేక పోవచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో ఓటర్ల నాడి ముందుగానే వాళ్లకు తెలుస్తుంది కాబట్టి, ఆయా రౌండ్లలో ఆయా అభ్యర్థులకు మెజార్టీ ఎంత అనేది కూడా అంచనా వేస్తారు. జిల్లాలో మొత్తం 1577 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఓట్లతోపాటు, పార్లమెంట్‌ ఓట్లను కూడా సమాంతరంగా లెక్కిస్తారు.

  • అనపర్తిలో 228 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇక్కడ 17రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అనపర్తిలోని 1వ బూత్‌ నుంచి లెక్కింపు మొదల వుతుంది. మొదట రౌండ్‌లో 1నుంచి 14వ పోలింగ్‌స్టేషన్లలోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. తర్వాత బిక్కవోలు, రంగంపేట మండలాల ఓట్లు లెక్కించి, చివరగా పెదపూడి మండలంలోని ఓట్లు లెక్కిస్తారు. కరకుదురు గ్రామంలోని ఓట్ల లెక్కింపుతో మొత్తం ఫలితం వెల్లడవుతుంది.

  • రాజానగరంలో 216 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మొదట రౌండ్‌ సీతానగరం మండలంలో 1 నుంచి 14వ పోలింగ్‌బూత్‌ల నుంచి మొదలవుతుంది. తర్వాత కోరుకొండ మండ లంలోని ఓట్లు లెక్కిస్తారు. చివరిగా రాజానగరం మండలంలోని ముక్కినాడ పాకలు గ్రామంలో ఓట్లు లెక్కిస్తారు.

  • రాజమహేంద్రవరం సిటీలో 237 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 17 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. సిటీలో మొదట శ్రీరాంనగర్‌, ఆనందనగర్‌, రాందాసు పేట, సుబ్బారావునగర్‌లోని క్వారీపేట ఓట్లు లెక్కిస్తారు. తర్వాత సుబ్బారావు నగర్‌, సిద్ధార్థనగర్‌, సంజీవయ్యనగర్‌, బర్మా కాలనీలోని ఓట్లను లెక్కిస్తారు. చివరిగా బ్రాడీపేట, అంబేద్కర్‌నగర్‌లోని ఓట్లను లెక్కిస్తారు.

  • రాజమహేంద్రవరం రూరల్‌లో 267 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 20 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు పూర్తవుతుంది. తొర్రేడు, వెంకటనగరం, కాతేరు, ప్రాంతా ల్లోని ఓట్లను లెక్కిస్తారు. రెండో రౌండ్‌లో కాతేరు, కోలమూరు, కొంతమూ రులో కొంత భాగం లెక్కిస్తారు. తర్వాత రాయుడుపాకల, మోరంపూడి, హు కుంపేట, సాటిలైట్‌సిటీ, బొమ్మూరు, రాజోలు, ధవళేశ్వరం గ్రామాల ఓట్లు లెక్కింపు అనంతరం రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలోని 8 డివిజన్ల ఓట్లు లెక్కిస్తారు. చివరిగా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెంలోని ఓట్లను లెక్కిస్తారు.

  • కొవ్వూరులో 176 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 13 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు పూర్తవుతుంది. తాళ్లపూడి మండలంలోని తాడిపూడి 1వ బూత్‌ నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. వరుసగా కొవ్వూరు మండలంలోని కొన్ని గ్రామా లు, మున్సిపాల్టీ వార్డులు, చాగల్లు మండలం, తిరిగి కొవ్వూరు మండలంలో చివరిగా మద్దూరు లంక ఓట్లను లెక్కిస్తారు.

  • నిడదవోలులో 205 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇక్కడ 15రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. నిడదవోలు మండలం కోరుమామిడి నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తాడిమళ్ల, ఉనకరమిల్లి, కాటకోటేశ్వరం, సూరాపురం, తిమ్మ రాజుపాలెం, తర్వాత నిడదవోలు పట్టణం ఓట్లు, మండలంలోని ఓట్లు లెక్కించాక ఉండ్రాజవరం మండలంలోని ఓట్లను లెక్కిస్తారు. చివరిగా పెర వలి మండలంలోని పిట్టలవేమవరంలోని కడింపాడు ఓట్లను లెక్కిస్తారు.

  • గోపాలపురంలో 248 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇక్కడ 18 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. గోపాలపురం మండలంలోని కరగపాడు నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తర్వాత దేవరపల్లి మండలం, తదుపరి నల్లజర్ల మండలం, ద్వారకాతిరుమల మండలాల్లో లెక్కింపు జరుగుతుంది. చివరిగా పి.కన్నాపురం శివారు సత్తాల ఓట్లు లెక్కిస్తారు.

Updated Date - Jun 04 , 2024 | 12:54 AM