రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:10 AM
గొల్లప్రోలు రూరల్, జూలై 7: గొల్లప్రోలు మండలం దుర్గాడ సెంటర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. పెద్దాపురం మండలం గోరింటకి చెందిన బల్లిపాటి వెంకటరమణ తన భార్య లక్ష్మీతో కలిసి గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు సత్తెమ్మతల్లి గుడి ఫంక్షన్‌హాలు వద్ద

గొల్లప్రోలు రూరల్, జూలై 7: గొల్లప్రోలు మండలం దుర్గాడ సెంటర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. పెద్దాపురం మండలం గోరింటకి చెందిన బల్లిపాటి వెంకటరమణ తన భార్య లక్ష్మీతో కలిసి గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు సత్తెమ్మతల్లి గుడి ఫంక్షన్‌హాలు వద్ద బంధు వుల ఫంక్షన్‌లో పాల్గొనేందుకు బయలుదేరారు. సత్తెమ్మతల్లి గుడి వద్ద రోడ్‌క్రాస్ చేసేందుకు ఆగగా పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్తున్న గేదెల లోడు వ్యాన్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పిఠాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గొల్లప్రోలు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.